సబ్బం హరీ...ఎక్కువచేస్తే ఇంటికొచ్చి బుద్ది చెప్తాం: వైసిపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : Oct 04, 2020, 01:16 PM ISTUpdated : Oct 04, 2020, 01:46 PM IST
సబ్బం హరీ...ఎక్కువచేస్తే ఇంటికొచ్చి బుద్ది చెప్తాం: వైసిపి ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ (వీడియో)

సారాంశం

ఇప్పుడు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ ఎంపీ సబ్బం హరి 213 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారన్నారని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఆరోపించారు. 

విశాఖపట్నం: అక్రమాలకు టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నయ్య అయితే మాజీ ఎంపీ సబ్బం హరి తమ్ముడు అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. విశాఖలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో భారీ అక్రమాలు, స్కాం లు జరిగాయన్నారు. 

ఇప్పుడు వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సబ్బం హరి కూడా 213 గజాల స్థలాన్ని అక్రమంగా ఆక్రమించారన్నారు. ఆయన ఆక్రమిస్తే తప్పులేదు కానీ దాన్ని అధికారులు తొలగిస్తే తప్పని చంద్రబాబు అండ్ కో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్ర బాబు బ్యాక్ డోర్ పొలిటీషియన్ అయితే సబ్బం హరి బ్లాక్ మెయిల్ నాయకుడని విమర్శించారు. 

read more  నూతన బినామీ చట్టం కింద దర్యాప్తు... జగన్ పై కేంద్రానికి ఫిర్యాదు: యనమల

తప్పు చేస్తే మాజీ ఎంపీ అయినా, మేయరు అయినా ఒకటేనన్నారు. టిడిపిలో దోపిడీలు, అక్రమాల్లో సీనియారిటీ బట్టి పదవులు ఇస్తారన్నారు. హత్య కేసులో నిందితుడు రవీంద్ర కు టిడిపి ప్రధాన కార్యదర్శగా నియమిస్తే... ఈఎస్ఐ స్కామ్ లో డబ్బు మింగేసిన అచ్చెన్నాయుడికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. 

''సబ్బం హరీ... నీవు ఎక్కువగా వార్నింగ్ లు ఇస్తే మీ ఇంటికి వచ్చి బుద్ది చెప్తాము. విశాఖ నగరం రాజకీయ భిక్ష ఇస్తే ఆ ప్రజలనే మోసగిస్తూ విషం చిమ్ముతున్నారు. ఇకపై వైసిపి ప్రభుత్వం, సీఎం జగన్ పై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు'' అని అమర్నాథ్ హెచ్చరించారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

Vegetable Price : టమాటా టార్గెట్ సెంచరీ..? ఏ కూరగాయా తగ్గట్లేదుగా : హైదరాబాద్ లో కూరగాయల ధరలు
IMD Cold Wave Alert : చలి తగ్గినా ఈ ప్రమాదం ఇంకా పొంచివుంది.. తస్మాత్ జాగ్రత్త