సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరుకానందున తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
విశాఖపట్టణం: సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హాజరుకానందున తాము చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారణ అయిందని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
భూకబ్జాలు, దౌర్జన్యాలపై తనపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై సాయిబాబా ఆలయంలో ప్రమాణానికి తాను సిద్దమేనని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రకటించారు. ఎమ్మెల్యే రామకృష్ణబాబు సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్వీకరించారు.
undefined
తన డిమాండ్ మేరకు సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు ఎంపీ విజయసాయిరెడ్డి రానందున విశాఖపట్టణం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రమాణం చేసేందుకు హాజరు కాలేదని టీడీపీ వర్గాలు చెబతున్నాయి.
also read:వైసీపీ అధికారంలోకి రావడంతో 'వెలగపూడి' ఆగడాలక్ చెక్: విజయసాయిరెడ్డి విమర్శలు
ఆదివారం నాడు సాయిబాబా ఆలయంలో 11 గంటల నుండి 12 గంటల వరకు వెలగపూడి రామకృష్ణ బాబు కోసం అమర్ నాథ్ ఎదురు చూశారు. రామకృష్ణబాబు రాకపోవడంతో 12 గంటల తర్వాత ఆలయం నుండి ఆయన వెనుదిరిగారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాము చేసిన ఆరోపణలు నిజమని తేలడంతోనే వెలగపూడి రామకృష్ణబాబు ముఖం చాటేశారన్నారు.
విజయసాయిరెడ్డి వస్తేనే వెలగపూడి ప్రమాణం చేస్తాననడం సరికాదని చెప్పారు. విజయసాయిరెడ్డిని ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ చేసే స్థాయి వెలగపూడికి లేదన్నారు.
ఆలయానికి మేం వచ్చాం... ప్రమాణానికి వెలగపూడి ఎందుకు రాలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.వెలగపూడి ఎన్నో అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.వంగవీటి రంగా హత్య కేసులో కూడ వెలగపూడి ఒకరని ఆయన చెప్పారు.
ఇకపై వెలగపూడి సవాళ్లు విసరడం మానుకోవాలని ఆయన సూచించారు. ఇకపై నుండి వెలగపూడి పిరికి సవాళ్లను స్వీకరించబోమన్నారు. చంద్రబాబు, లోకేష్ సవాళ్లనే స్వీకరిస్తామని ఆయన స్పష్టం చేశారు.