విశాఖలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు: సాయిబాబా టెంపుల్ వద్ద వెలగపూడి కోసం అమర్‌నాథ్ ఎదురుచూపు

Published : Dec 27, 2020, 11:28 AM IST
విశాఖలో టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు:  సాయిబాబా టెంపుల్ వద్ద వెలగపూడి కోసం అమర్‌నాథ్ ఎదురుచూపు

సారాంశం

విశాఖపట్టణం జిల్లాలోని టీడీపీ. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడేక్కాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే అమర్నాత్ స్వీకరించారు. ఆదివారం నాడు అమర్నాథ్ సాయిబాబా ఆలయానికి చేరుకొన్నారు.

విశాఖపట్టణం:  విశాఖపట్టణం జిల్లాలోని టీడీపీ. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడేక్కాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సవాల్ ను వైసీపీ ఎమ్మెల్యే అమర్నాత్ స్వీకరించారు. ఆదివారం నాడు అమర్నాథ్ సాయిబాబా ఆలయానికి చేరుకొన్నారు.

నగరంలోని ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడిలో ప్రమాణం చేసేందుకు అనుచరులతో కలిసి  అమర్ నాథ్ రెడ్డి  ఇవాళ ఉదయం 11 గంటలకు చేరుకొన్నాడు. గాజువాక నుండి ర్యాలీగా బీచ్ రోడ్డుకు అమర్ నాథ్ రెడ్డి వచ్చారు. మార్గమధ్యలోని వైఎస్ఆర్ విగ్రహనికి అమర్ నాథ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు అక్కడి నుండి ఆయన పాదయాత్రగా సాయిబాబా ఆలయానికి చేరుకొన్నారు. 

also read:నాపై రామకృష్ణారెడ్డి ఆరోపణల్లో వాస్తవం లేదు: అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి

విశాఖపట్టణంలో భూ ఆక్రమణలపై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి సవాల్ చేశారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై  సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. ఈ ప్రమాణానికి విజయసాయిరెడ్డిని రావాలని ఆయన కోరారు.

అయితే ఈ సవాల్ కు వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ రెడ్డి స్పందించారు.  ఈ సవాల్ పై టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మరోసారి స్పందించారు. ఎంపీ విజయసాయిరెడ్డి వస్తేనే తాను  ప్రమాణం చేసేందుకు వస్తానని ఆయన ప్రకటించారు.

ఎమ్మెల్యే రామకృష్ణబాబు వంగవీటి రంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు రుషికొండలో ప్రభుత్వ భూమిని రామకృష్ణబాబు భూమిని ఆక్రమించుకొన్నాడని అమర్‌నాథ్ ఆరోపించారు.

ఇవాళ 12 గంటల వరకు రామకృష్ణబాబు కోసం తాను ఎదురు చూస్తానని ఆయన చెప్పారు. సాయిబాబా ఆలయం వద్ద ప్రమాణానికి రాకపోతే  రామకృష్ణబాబుపై  చేసిన ఆరోపణలు నిజమని నమ్మాల్సివస్తోందన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu