ఇవే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలు అన్న వైసిపి విమర్శలను అంతే ఘాటుగా తిప్పికొట్టారు ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల వేడి మొదలయ్యింది. ఇప్పటికే అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకులు మాటల యుద్దాన్ని మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇవే తెలుగుదేశం పార్టీకి చివరి ఎన్నికలు అన్న వైసిపి విమర్శలను అంతే ఘాటుగా తిప్పికొట్టారు ఆ పార్టీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈ మేరకు ట్విట్టర్ వేదికన వైసిపిపై విరుచుకుపడ్డారు గోరంట్ల.
''తెలుగుదేశం వాళ్ళకి ఇవి ఆఖరి ఎన్నికలు -- వైసీపీ
వైసీపీ వారికి ఇవే ఆఖరి కోర్ట్ మొట్టికాయలు, ఇంక తరువాత జైలే -- ప్రజలు
ఒక పక్క పార్టీలకు సంబంధం లేదు అంటూనే మరోపక్క టిడిపి కి చివరి ఎన్నికలు అంటున్నారు. ఒక్క సారి సరిగ్గా చూపించుకోండి మీ పేపర్ యాడ్స్ వైఎస్ జగన్'' అంటూ ట్విట్టర్ వేదికన వైసిపి నాయకులకు కౌంటరిచ్చారు బుచ్చయ్య చౌదరి.
read more శరీరమే నిమ్మగడ్డది, చంద్రముఖిలా చంద్రబాబు ప్రవేశించి లకలక: విజయసాయి
''ఎన్నికలు మీ జాగిరు కాదు.ఇది ప్రజాస్వామ్యం అనే సంగతి మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు.బాధ్యత గల పదవి లో ఉన్నాం అనే సంగతి మర్చిపోయి ఎన్నికల సంఘం పై విమర్శలు చేస్తున్నారు'' అని ఆరోపించారు.
''ఇసుకని ప్రజల కి ఇవ్వలేని వారు..
భవన నిర్మాణ కార్మికులు ని ఆదుకోలేని వారు...
కరోన సమయం లో పిపిఈ కిట్లు,మాస్కలు ఇవ్వలేని వారు...
రహదారులు ని బాగుచెయ్యలేని వారు..
పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచుతున్న వారు..
పన్నులు అధికంగా వేస్తున్న వారు..
అప్పులు కుప్ప గా మారుస్తున్న వారు..
నిత్యావసర ధరలు పెంచుతున్న వారు..
కమీషన్ల వేట తో అభివృద్ధి గాలికి వదిలేసిన వారు..
ఉద్యోగ కల్పన చేయలేని వారు..
గ్రామాల్లో వైషమ్యాలు రెచ్చగొడుతున్న వారు...
మత సామరస్యం కాపడలేని వారు..
ఇప్పుడు ఏకగ్రీవ పంచాయితీ లకు నజరానా ఇస్తాం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది'' అని బుచ్చయ్య మండిపడ్డారు.
''ప్రజలు నమ్మే పరిస్థితి లో లేరు. ఎందుకు ఏకగ్రీవల పై ఆశ...! పార్టీల గొడవ లేదు అని చెబుతూనే ఎన్నికకు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు'' అని వైసిపి నాయకత్వాన్ని ప్రశ్నించారు బుచ్చయ్య చౌదరి.