బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీకి ఓటేస్తేరా అంటూ తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాంబాబు ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కేవలం ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడని... ఇది తెలంగాణ కాదు ఏపి అని జగన్ పాలిస్తున్న రాష్ట్రమని బండి సంజయ్ గ్రహించాలని చురకలంటించారు
బైబిల్ పార్టీ, భగవద్గీత పార్టీకి ఓటేస్తేరా అంటూ తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాంబాబు ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ కేవలం ఒక కార్పొరేటర్ స్థాయి నాయకుడని... ఇది తెలంగాణ కాదు ఏపి అని జగన్ పాలిస్తున్న రాష్ట్రమని బండి సంజయ్ గ్రహించాలని చురకలంటించారు.
ఎక్కడ హత్య జరిగితే అక్కడికి లోకేష్ వెళ్లి జగన్ మోహన్ రెడ్డి హత్య చేయించారని ఆరోపణలు చేస్తున్నారని రాంబాబు మండిపడ్డారు. సీఎం జగన్ నీ విమర్శించే స్థాయి లోకేశ్‌కి లేదని... కనీసం ఒకసారైనా లోకేష్ ప్రజల ద్వారా గెలిచారా అని అంబటి ప్రశ్నించారు.
లోకేష్ శవ రాజకీయాలు మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. దాచేపల్లి లో జరిగిన అంకుల్ హత్య కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుందని.. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాంబాబు స్పష్టం చేశారు.
కాగా మొన్న మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ .. తెలంగాణలానే ఏపీకి కూడా షాక్ ట్రీట్‌మెంట్ తప్పదని హెచ్చరించారు. తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
బైబిల్ కావాలో.. భగవద్గీత కావాలో తిరుపతి ఓటర్లు తేల్చుకోవాలని సంజయ్ స్పష్టం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే తిరుపతి ఎన్నికల్లో పునరావృతం అవుతాయని ఆయన జోస్యం చెప్పారు.