అందరూ చూస్తుండగా.. గొంతు కోసుకున్న మహిళ..!

Published : Jan 06, 2021, 02:21 PM IST
అందరూ చూస్తుండగా.. గొంతు కోసుకున్న మహిళ..!

సారాంశం

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన అంజలి(25)కి పురుషోత్తం అనే డ్రైవర్‌తో వివాహమైంది. రెండో వివాహం చేసుకున్న అతడు ఆమెను వదిలేశాడు


ఆమెకు పెళ్లై కనీసం రెండు సంవత్సరాలు కూడా కావడం లేదు. ఆమె ఆశలన్నీ అడియాశలయ్యాయి. భర్తే జీవితంగా బతికిన ఆమెకు భర్త దూరం కావడం తట్టుకోలేకపోయింది. తాను కట్టుకున్న భర్త తనని కాదని.. మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేకపోయింది.  దీంతో.. భర్త  మోసం చేశాడనే మనస్తాపంతో ఓ మహిళ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు మేరకు.. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన అంజలి(25)కి పురుషోత్తం అనే డ్రైవర్‌తో వివాహమైంది. రెండో వివాహం చేసుకున్న అతడు ఆమెను వదిలేశాడు

దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. బుధవారం ప్రజలందరి ముందు బ్లేడుతో గొంతు కోసుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను అడ్డగించిన పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Sajjala Ramakrishna Reddy Sensational Comments On Localbody Elections 2026 | Asianet News Telugu
విద్యార్థుల‌కు ఏపీ ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. త‌ల్లికి వంద‌నం రెండో విడ‌త నిధుల‌పై కీల‌క అప్‌డేట్