ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ప్రజా రంజక పాలన చేస్తున్నందున ప్రజలు అపూర్వ విజయాన్ని అందించారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నందునే స్థానిక సంస్థల ఫలితాల్లో మంచి ఫలితాలు దక్కాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.
స్థానిక సంస్థలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మహాత్మా గాంధీ చెప్పినట్లు స్థానికంగా పరిపాలన జరగాలన్నారు అంబటి రాంబాబు. ఈ ఎన్నికలు సరైన సమయంలో జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ గత ప్రభుత్వంలోనే గడువు ముగిసిందని చెప్పారు.
also read:ఎంపీటీసీ ఫలితాలు: చంద్రబాబుకు భారీ షాక్.. కుప్పంలో వైసీపీ ప్రభంజనం
రాజ్యాంగపరంగా ఎన్నికలు జరపాలి. చంద్రబాబు గెలవలేమని ఎన్నికలు పెట్టకుండా పారిపోయాడని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలు పెట్టాలని కృషి చేశారు. అప్పుడు ప్రారంభించిన ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతోందని అంబటి రాంబాబు గుర్తు చేశారు.
చంద్రబాబు, ఆయనతో కలిసి కొన్ని దుష్ట శక్తులు ఎన్నో కుట్రలు చేశాయని అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నువ్వు, నీ కొడుకు కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితాలు ఏమైనా మారాయా ఆయన ప్రశ్నించారు. కుప్పం కూడా కుప్పకూలి పోయింది... చంద్రగిరి శంకరగిరి మాన్యాలు పట్టిందన్నారు. ఇక టీడీపీ మూసేయడానికి సిద్ధంగా ఉంది...తెలుసుకోలేకపోతే నీ ఖర్మ’’ అన్నారు అంబటి రాంబాబు.
ఈ ఫలితాలు జగన్‌మోహన్‌రెడ్డి జనరంజక పాలన చేస్తున్నాడు కాబట్టే వస్తున్నాయన్నారు.ఇలాంటి చక్కని ఫలితాలను ఇస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.