తిరుమల: శ్రీవారి సర్వదర్శనానికి ఎగబడుతున్న తమిళులు.. టీటీడీ యాక్షన్ ఇది

By Siva KodatiFirst Published Sep 19, 2021, 4:21 PM IST
Highlights

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత బుధవారం నుంచి టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు.

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించింది టీటీడీ. ప్రయోగాత్మకంగా చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పెరటాసి మాసం వల్ల భారీగా తరలివస్తున్నారు తమిళ భక్తులు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన టీటీడీ టోకెన్లను 2 వేల నుంచి 8 వేలకు పెంచింది. ఇవాళ్టీ నుంచి నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. దీనితో పాటు శ్రీవారి దర్శన సమయాన్ని కూడా టీటీడీ పెంచింది. 

సుదీర్ఘ విరామం తర్వాత తిరుమలలో శ్రీవారి సర్వ దర్శనానికి టీటీడీ అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత బుధవారం నుంచి టోకెన్లు జారీ చేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ అనుమతితో తిరుపతి శ్రీనివాసంలో సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు టోకెన్ల జారీ ప్రారంభమైంది. రోజుకు రెండు వేల చొప్పున టోకెన్లను ఇస్తున్నారు. 

కేవలం చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం అవకాశం కల్పించారు. దీంతో సర్వదర్శనం కోసం చిత్తూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి తరలివచ్చారు. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే సర్వదర్శనం టికెట్ల కోసం క్యూ లైన్‌లలో వేచి ఉన్నారు.  దాదాపు ఐదు నెలల తర్వాత భక్తులకు శ్రీవారి సర్వదర్శన భాగ్యం కలిగడంతో యాత్రీకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఏప్రిల్‌ 11 నుంచి టీటీడీ ఈ టోకెన్ల జారీని నిలిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులకు టోకెన్లు ఇవ్వడం లేదు. ఒకసారి దర్శనం అనంతరం నెల వ్యవధి ఉంటేనే టోకెన్లు ఇస్తున్నారు.

click me!