ఎంపీటీసీ ఫలితాలు: చంద్రబాబుకు భారీ షాక్.. కుప్పంలో వైసీపీ ప్రభంజనం

By telugu team  |  First Published Sep 19, 2021, 4:28 PM IST

పరిషత్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంటున్నది. ఇప్పటికే రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకుంది. టీడీపీ కంచుకోటలోనూ గెలుస్తూ సరికొత్త రికార్డులు రాసుకుంటున్నది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ, ఆయన స్వగ్రామం నారావారిపల్లెలోనూ వైసీపీ ఆధిపత్యంతో దూకుడుమీదున్నది.


అమరావతి: స్థానిక ఎన్నికల్లో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంతనియోజకవర్గం కుప్పంలోనూ వైసీపీ ఫ్యాన్ గాలి బలంగా వీచింది. అంతేకాదు, స్వగ్రామం నారావారిపల్లెలోనూ టీడీపీ ఘోర పరాజాయాన్ని చవిచూడాల్సి వచ్చింది. వైసీపీ అభ్యర్థులు రికార్డులు బద్దలు చేస్తూ విజయాలను నమోదు చేశారు. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ ఓడిపోయింది. కుప్పం మండలం టీ సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైసీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్లతో విజయం సాధించి 30 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. కుప్పంలోని 85శాతానికి పైగా పంచాయతీల్లోనూ వైసీపీ తన విజయదుందుభిని ప్రదర్శించింది. మొత్తం నాలుగు మండలాల్లో వైసీపీ ఘన విజయాన్ని సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీ స్థానాల్లో 17 వైసీసీ ఖాతాలో వేసుకుంది. టీడీపీ రెండు సీట్లకు పరిమితమైంది. గుడిపల్లె మండలంలో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా గెలుపొంది వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీల్లో అన్ని చోట్ల వైసీపీనే గెలుచుకుంది. శాంతిపురం మండలంలోనూ మెజార్టీగా వైసీపీనే గెలుపొందింది.

పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లి ఎంపీటీసీనీ వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గంగాధరం ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి రాజయ్య 1,347ఓట్లతో విజయం కైవసం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థికి కేవలం 307 మాత్రమే పోలవడం గమనార్హం.

Latest Videos

ఇదిలా ఉండగా టీడీపీ స్థాపించిన ఎన్టీఆర్ స్వగ్రామంలోనూ వైసీపీ తన జైత్రయాత్రను కొనసాగించింది. కృష్టా జిల్లా పామర్రు మండలం నిమ్మకూరు ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ తొలిసారగా వైసీపీ గెలుపొంది సరికొత్త రికార్డు రాసుకుంది.

click me!