అన్నమయ్య డ్యామ్ రగడ.. ఎప్పుడూ ఒకరి మీద పడి ఏడవటమే: వరదలపై చంద్రబాబుకు అంబటి కౌంటర్

Siva Kodati |  
Published : Dec 05, 2021, 05:40 PM IST
అన్నమయ్య డ్యామ్ రగడ.. ఎప్పుడూ ఒకరి మీద పడి ఏడవటమే: వరదలపై చంద్రబాబుకు అంబటి కౌంటర్

సారాంశం

వర్షాలు, వరదలపై (ap floods) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఊహించని వరదలతో అన్నమయ్య ప్రాజెక్ట్ దెబ్బతిన్నదని ఆయన తెలిపారు.

వర్షాలు, వరదలపై (ap floods) టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలకు వైసీపీ (ysrcp) ఎమ్మెల్యే అంబటి రాంబాబు (ambati rambabu) కౌంటర్ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చూడని విధంగా భారీ వర్షాలు, వరదలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. ఊహించని వరదలతో అన్నమయ్య ప్రాజెక్ట్ దెబ్బతిన్నదని ఆయన తెలిపారు. అసత్యాలతో ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని.. వరద బాధితులు జగన్‌తో అప్యాయంగా మాట్లాడటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని రాంబాబు ఎద్దేవా చేశారు. అందుకే ఫ్రస్ట్రేషన్‌తో బుద్ధుందా లేదా అంటూ ప్రజలపైనే తిరగబడుతున్నారని రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు జీవితమంతా ఒకరిమీదపడి ఏడవటం తప్ప ఇంకోటీ లేదని అంబటి దుయ్యబట్టారు. 

కాగా.. అన్నమయ్య ప్రాజెక్టు (Annamayya project) విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్.. అన్నమయ్య డ్యామ్ కొట్టుకు‌పోవడంపై ప్రతిపక్షాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై మండిపడ్డారు. చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు‌పై ఆయన ప్రెస్‌మీట్ చూశానని.. అందులో చాలా విషయాలు దాచిపెట్టారని అన్నారు. 

Also Read:విపత్తు జరిగితే ప్రభుత్వ వైఫల్యం అంటారా?.. చంద్రబాబుది మురికి నోరు: మంత్రి అనిల్‌ కుమార్ మండిపాటు..

అన్నమయ్య ప్రాజెక్ట్ సామర్థ్యం  2 లక్షల 17 వేల క్యూసెక్కులు మాత్రమేనని.. కానీ గంటల వ్యవధిలోనే 3 లక్షల 20 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని అన్నారు. స్థానికంగా భారీ వర్షం కురిసిందని, పై నుంచి వరద కూడా విపరీతంగా వచ్చిందని చెప్పారు. అధికారులు పగలు రాత్రి లేకుండా పనిచేశారని తెలిపారు. విపత్తు వల్ల జరిగిన ఘటనను.. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటారని ప్రశ్నించారు. 

ఒక్క గేట్ రిపేర్ చేయించడం కుదరలేదన్న అనిల్ కుమార్.. చంద్రబాబు ఉన్నప్పుడు వర్షాలు పడలేదని అప్పుడు గేట్‌కు మరమ్మతులు చేయించి ఉంటే బాగుండేదని అన్నారు. డ్యామ్ సెఫ్టీకి 2017లో కొత్త స్పిల్‌ వే కట్టమంటే చంద్రబాబు ఏం చేశారు.. అప్పుడు నీళ్లు కూడా లేవని చెప్పుకొచ్చారు. కానీ వైఎస్ జగన్ సీఎం అయ్యాక.. వర్షాలు కురిశాయని అందువల్ల రిపేర్ చేయించడం కుదరలేదని అన్నారు. 

ఆ రోజు భారీ వర్షం కురుస్తుందని మాత్రమే వార్నింగ్ ఉందని.. ఎక్కడ కూడా ఇంత పెద్ద ఎత్తున వరద  వస్తుందని సంకేతాలు లేవని చెప్పారు. చంద్రబాబు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రి షేకావత్ మాటలు బాధకలిగించాయని అన్నారు. కేంద్ర మంత్రి మాటలు రబ్బర్ స్టాంపా..? అని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్న చంద్రబాబు ఏజెంట్లు ఏం చేస్తున్నారనేది తెలుస్తుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏజెంట్లు సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇలాంటి సమాచారం ఇచ్చి ఉంటారని విమర్శించారు. కేంద్రం ఏం మాట్లాడితే అది నిజమై పోతుందా..? అని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘటన గురించి వాళ్లు ఏం చెప్తారని అడిగారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్