ముగియనున్న పాదయాత్ర: 17న తిరుపతిలో భారీ సభ, పోలీసుల అనుమతి కోరిన అమరావతి రైతులు

By Siva KodatiFirst Published Dec 5, 2021, 4:02 PM IST
Highlights

ఈనెల 17న తిరుపతిలో (tirupati) నిర్వహించతలపెట్టిన అమరావతి పరిరక్షణ (amaravati parirakshana samithi)బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సమితి నాయకులు జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. 

ఈనెల 17న తిరుపతిలో (tirupati) నిర్వహించతలపెట్టిన అమరావతి పరిరక్షణ (amaravati parirakshana samithi)బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సమితి నాయకులు జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండ్‌తో అమరావతి న్యాయస్థానం నుంచి తిరుపతి దేవస్థానం వరకు (nyayasthanam to devasthanam) సమితి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నామని లేఖలో ఎస్పీకి తెలియజేశారు. 17వ తేదీన పాదయాత్ర తిరుపతికి చేరుకుని ముగస్తుందని.. అదేరోజున తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతి మంజూరుచేసి సహకరించాలని సమితి ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు జిల్లా ఎస్పీని అభ్యర్థించారు. 

శాంతి భద్రతలకు ఆటంకం లేకుండా, కొవిడ్‌ నిబంధనలను అనుసరిస్తూ సభను నిర్వహించుకుంటామని వారు కోరారు. దీంతో బహిరంగ సభకు సంబంధించిన పూర్తివివరాలు అందించాలని ఎస్పీ.. సమితి నాయకులను కోరారు. వారినుంచి సమాచారం అందిన తర్వాత అనుమతిపై నిర్ణయం తీసుకోనున్నారు పోలీసులు. ఇకపోతే, అమరావతి రైతులు పాదయాత్ర నేడు 35వ రోజు కొనసాగుతుంది. ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా పుట్టంరాజు కండ్రిగలో పాదయాత్రను ప్రారంభించిన రైతులు.. వెంకటరెడ్డిపల్లి, అంబలపూడి, బాలాయపల్లి మీదుగా పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఈరోజు రైతుల పాదయాత్ర వెంగమాంబపురంలో ముగియనుంది. 

ALso Read:ఆ ఆరోపణల్లో వాస్తవం లేదు.. అమరావతి రైతుల పాదయాత్రకు మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సంఘీభావం

కాగా.. సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (ys jagan mohan reddy) మూడు రాజధానుల నిర్ణయానికి (three capitals) వ్యతిరేకంగా.. అమరావతి ప్రాంత రైతులు, మహిళలు పోరాటం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని.. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు ఉద్యమ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే న్యాయస్థానం నుంచి దేవస్థానం మహా పాదయాత్ర చేపట్టానలి అమరావతి రైతులు నిర్ణయించారు. అయితే ఇందుకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీంతో నిర్వాహకులు కోర్టును ఆశ్రయించారు. రైతుల తరఫు వాదనలతో ఏకీ భవించిన కోర్టు.. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది.

దీంతో రైతులు నవంబర్ 1వ తేదీన మహా పాదయాత్రను ప్రారంభించారు. 45 రోజుల పాటు న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో ఈ పాదయాత్ర సాగనుంది. తుళ్లూరు నుంచి తిరుపతి వరకు కొనసాగనుంది. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు సాగేలా షెడ్యూల్ ఖరారు చేశారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా సాగనుంది. రైతుల పాదయాత్రకు టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. పార్టీలు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

click me!