బస్సు యాత్రతో తప్పుడు వాగ్దానాలు చేస్తున్న వైసీపీ: జ‌గ‌న్ పై టీడీపీ విమ‌ర్శ‌లు

By Mahesh Rajamoni  |  First Published Oct 29, 2023, 1:50 AM IST

Former Gajuwaka MLA Palla Srinivasa Rao: ఏపీ అధికార పార్టీ వైకాపా చేపట్టిన సామాజిక సాధికార బ‌స్సు యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ..  ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన సామాజిక న్యాయం యాత్రలో వెలుగుచూడాలనీ, తద్వారా రానున్న రోజుల్లో పేదల ధనిక పోరులో విజయం సాధించేందుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. అయితే, బస్సు యాత్ర ద్వారా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నార‌ని సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది.
 


Visakhapatnam: బస్సుయాత్ర ద్వారా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నార‌ని సీఎం జగన్ మోహ‌న్ రెడ్డిపై టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఏపీ అధికార పార్టీ వైకాపా చేపట్టిన సామాజిక సాధికార బ‌స్సు యాత్రపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ..  ఈ నాలుగున్నరేళ్లలో జరిగిన సామాజిక న్యాయం యాత్రలో వెలుగుచూడాలనీ, తద్వారా రానున్న రోజుల్లో పేదల ధనిక పోరులో విజయం సాధించేందుకు బాటలు వేయాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం విశాఖ‌లో కొన‌సాగుతున్న వైకాపా బ‌స్సు యాత్ర‌పై గాజువాక మాజీ ఎమ్మెల్యే, విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విమ‌ర్శ‌లు గుప్పించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన బస్సుయాత్ర ద్వారా తప్పుడు వాగ్దానాలు చేస్తున్నారని విశాఖపట్నం జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లాలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ అణగారిన వర్గాలను దోపిడి చేస్తూనే సీఎం పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి 120 సంక్షేమ పథకాలను ఉపసంహరించుకోగా మరో 27 పథకాలను నీరుగార్చారన్నారు.

Latest Videos

undefined

కేవలం బస్సు యాత్రలతోనే సామాజిక న్యాయం జరగదని శ్రీనివాసరావు విలేకరులతో అన్నారు.ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయ ఎత్తుగడగా ఈ యాత్ర‌ను అభివ‌ర్ణించారు. ముఖ్య‌మంత్రి ఆఫీసులు లేకుండానే  కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కార్యాలయాల స్థాపనకు నిధులు మంజూరు చేయకుండానే తాను వెనుకబడిన వర్గాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారికి సేవ చేసిన‌ట్టు చెప్పుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. జీవీఎంసీ  ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, ఇతర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


 

click me!