నిన్న చంద్రబాబు నివాసం... ఇవాళ అయ్యన్న ఇల్లు : దూసుకొచ్చిన వైసీపీ శ్రేణులు, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Sep 18, 2021, 2:28 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నిన్న ఏకంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటిపైకే దాడికి యత్నించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా శనివారం అయ్యన్నపాత్రుడి ఇంటిని ముట్టడించేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించాయి. వైసీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ ఆధ్వర్యంలో అయ్యన్న ఇంటిని ముట్టడించేందుకు కార్యకర్తలు భారీ ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తెలెత్తాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిన ఉమాశంకర్... అయ్యన్నపాత్రుడిపై ఫిర్యాదు చేశారు.

Also Read:చంద్రబాబు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్, అనుచరుల దాడి విజువల్స్

మరోవైపు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యల్లో అభ్యంతరాలు ఉంటే శాంతియుతంగా ఆందోళనలు చేయడం లేదా పోలీసులకు ఫిర్యాదు చేయడం చేయవచ్చని.. కానీ, వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల కంటే అయ్యన్న ఎక్కువగా ఏమీ మాట్లాడలేదని ఆయనకు అండగా నిలిచారు. దౌర్జన్యాలకు పాల్పడుతున్న వైసీపీ శ్రేణులపై కేసులు నమోదు చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.
 

click me!