గూండాలు,రౌడీలతో చంద్రబాబే నా మీద దాడి చేయించారు.. జోగి రమేష్

Published : Sep 18, 2021, 12:43 PM IST
గూండాలు,రౌడీలతో చంద్రబాబే నా మీద దాడి చేయించారు.. జోగి రమేష్

సారాంశం

అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనమీద టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ మీద దాడి చేస్తారా? అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు. 

తాడేపల్లి : సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. ఆయన శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎల్లో మీడియా అయ్యన్న పాత్రుడికి వత్తాసు పలుకుతోందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. 

అయ్యన్న వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు వెళ్లిన తనమీద టీడీపీ నేతలు దాడి చేశారని తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలిపిన తమ మీద దాడి చేస్తారా? అని నిలదీశారు. అయ్యన్న పాత్రుడిని ప్రేరేపించి మాట్లాడించింది చంద్రబాబే అని ఆరోపించారు. 

తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదని ప్రజాక్షేత్రంలో ఉండాలన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలన చేస్తున్నారని అన్నారు. సంక్షేమ పాలనను చూసిన టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, మహిళల మీద అయ్యన్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు. 

గూండాలు, రౌడీ మూకలను పంపించి చంద్రబాబు తనమీద దాడి చేయించారని అన్నారు. చంద్రబాబు క్షమాపణ చెప్పాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?