గాజువాక వైసీపీలో అసంతృప్తి సెగలు.. అసమ్మతి నేతల సీక్రెట్ మీటింగ్

By Siva KodatiFirst Published Jan 23, 2024, 4:07 PM IST
Highlights

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గెలవరు అని తెలిస్తే చాలు ఆత్మీయులైనా, బంధువులైనా పక్కనపెట్టేస్తున్నారు జగన్. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గెలవరు అని తెలిస్తే చాలు ఆత్మీయులైనా, బంధువులైనా పక్కనపెట్టేస్తున్నారు జగన్. కానీ ఇది నియోజకవర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది. దీంతో వారు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేనల్లో చేరుతున్నారు. అలాంటి వాటిలో గాజువాక నియోజకవర్గం. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుటుంబానికి మరో అవకాశం ఇవ్వాలని నగర కార్పోరేటర్లు, కీలక నేతలు డిమాండ్ చేస్తున్నారు. దీనిలో భాగంగా గాజువాకకు చెందిన కీలక నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. 

నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చేలా వైసీపీ అధిష్టానంపై ఒత్తిడి పెంచేలా వ్యూహం రచిస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీని కూడా వారు కలిశారు. టికెట్ ఇవ్వకపోతే ఏం చేయాలనే దానిపై ఈ భేటీలో చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. గాజువాక ఇన్‌ఛార్జిగా నాగిరెడ్డికి బదులుగా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను నియమించిన విషయం తెలిసిందే.  కాగా.. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని నాగిరెడ్డి అధిష్టానాన్ని కోరుతున్నారు. కానీ తిప్పల కుటుంబంపై పార్టీలోనూ , జనంలోనూ తీవ్ర వ్యతిరేకత వుందని అంటున్నారు. ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకున్న హైకమాండ్ తిప్పల అభ్యర్ధును తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో దేవన్ రెడ్డి గాజువాక వైసీపీ ఇన్‌ఛార్జి పదవికి రాజీనామా చేశారు.

Latest Videos

click me!