ఆ నోళ్లని పినాయిల్‌తో కడగాలేమో: టీడీపీ నేతలపై వైసీపీ నాయకుల తీవ్ర వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 17, 2021, 07:09 PM IST
ఆ నోళ్లని పినాయిల్‌తో కడగాలేమో: టీడీపీ నేతలపై వైసీపీ నాయకుల తీవ్ర వ్యాఖ్యలు

సారాంశం

అయ్యన్న పాత్రుడు, చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్‌కి వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్‌ చేయాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే అంతా జరుగుతోందని.. ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడిని ఖండిస్తున్నామన్నారు  

నిన్న ఒక ఆంబోతు ఎలా అంటే అలా ప్రవర్తించిందంటూ టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున. చంద్రబాబు, అయ్యన్నపాత్రుడిలపై డీజీపీ గౌతం సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడెల సంస్కరణ సభ పెడితే మాపై కారుకూతలు కోశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. 

మా ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడలేదు అని అడగటానికి వెళితే కాల్ మనీ సెక్స్ రాకెట్ వాళ్ళు దాడి చేశారని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక బీసీ కులానికి చెందిన ఎమ్మెల్యేకి చంద్రబాబు ఇంటి వద్ద రక్షణ లేదని.. దీన్ని ఆసరాగా చేసుకుని అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని మేరుగ ఆరోపించారు. మీకు సిగ్గు శరం ఉంటే ఇలాంటి దాడులు చేయరని.. ఈ అలజడులకు అకృత్యాలకు బాద్యుడు చంద్రబాబేనని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబుని అరెస్ట్ చేయాలని కోరామని.. ఆయనతో పాటు అయ్యన్నను కూడా అదుపులోకి తీసుకోవాలని కోరామని నాగార్జున తెలిపారు. 

Also Read:డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు.. అయ్యన్న వెనుక చంద్రబాబు, అరెస్ట్ చేయాల్సిందే: జోగి రమేశ్

ఎమ్మెల్యే మద్దాలిగిరి మాట్లాడుతూ.. ఆ టీడీపీ ఎటుపోతుందో ప్రజలు గమనించాలని పిలుపునిచ్చారు. అయ్యన్న మాట్లాడిన మాట సభ్యసమాజం తలదించుకోవాల్సిన మాట అని.. న్యూస్ లోకి రావడానికి ఎలాగైనా మాట్లాడతారు, ఏమైనా చేస్తారని ఆయన దుయ్యబట్టారు. ఉదయం జరిగిన విజువల్, సీసీ ఫుటేజ్ చూస్తే వాస్తవం తెలుస్తుందని.. శాంతియుతంగా తాను అడగడానికి వెళితే దాడికి దిగారని మద్దాలిగిరి ఆరోపించారు. అయ్యన్న లాంటి వ్యక్తులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారా.. అని ఆయన మండిపడ్డారు. 

తాను అక్కడికి వెళ్లకముందే గూండాలని, కాల్ మనీ సెక్స్ గాళ్లని పెట్టుకుని దాడి చేశారని మద్దాలిగిరి ఆరోపించారు. సిగ్గు, శరం, చీము, నెత్తురు చంద్రబాబుకు ఉన్నాయా .. వీళ్ళ నోళ్ళను పినాయిల్ వేసి కడగాలా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు ఇలానే ప్రవర్తిస్తే చంద్రబాబును తిరగనివ్వమని.. అసలు చంద్రబాబుకు ఇక్కడ ఆధార్, రేషన్ కార్డ్ ఉందా అని గిరి ప్రశ్నించారు. చంద్రబాబు కొడుకు ఎదో మాట్లాడుతున్నాడట...జగన్ ఇంటి వంక చూస్తే తాట తీస్తామని మద్దాలిగిరి వార్నింగ్ ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్‌లు | Asianet News Telugu
Pawan Kalyan: కాకినాడలో ‘మన ఊరు - మాట మంతి’ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu