ఏపీ: 24 గంటల్లో 1393 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం

Siva Kodati |  
Published : Sep 17, 2021, 05:58 PM ISTUpdated : Sep 17, 2021, 06:01 PM IST
ఏపీ: 24 గంటల్లో 1393 మందికి పాజిటివ్.. మూడు జిల్లాల్లో కరోనా ఉగ్రరూపం

సారాంశం

ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు నమోదవ్వగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,296 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,797 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,393 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,33,284కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,052కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 2, ప్రకాశం 2, చిత్తూరు 3, తూర్పుగోదావరిలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,296 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,04,435కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 60,350 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,75,96,989కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,797 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 18, చిత్తూరు 272, తూర్పుగోదావరి 206, గుంటూరు 132, కడప 60, కృష్ణ 162, కర్నూలు 5, నెల్లూరు 201, ప్రకాశం 120, శ్రీకాకుళం 28, విశాఖపట్నం 51, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 129 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP