డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు.. అయ్యన్న వెనుక చంద్రబాబు, అరెస్ట్ చేయాల్సిందే: జోగి రమేశ్

Siva Kodati |  
Published : Sep 17, 2021, 06:39 PM ISTUpdated : Sep 17, 2021, 06:41 PM IST
డీజీపీకి వైసీపీ నేతల ఫిర్యాదు.. అయ్యన్న వెనుక చంద్రబాబు, అరెస్ట్ చేయాల్సిందే: జోగి రమేశ్

సారాంశం

నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబని.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి జగన్ అని రమేశ్ చెప్పారు. 

అయ్యన్నపాత్రుడు, చంద్రబాబులపై వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామన్నారు.  జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం వుందని మేరుగ నాగార్జున ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని ఆరోపించారు. జోగి రమేశ్‌పై భౌతిక దాడికి దిగటం అత్యంత దారుణమని ఆర్కే అన్నారు. అయ్యన్నతో మాట్లాడించింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు.

చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని ఆర్కే దుయ్యబట్టారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరామని ఆర్కే తెలిపారు. అనంతరం బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మాట్లాడుతూ.. చంద్రబాబుకి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఆయన అన్నారు. ఆయన ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని సురేశ్ ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

ALso Read:చర్చి ఫాదర్లు ‘‘ ఓ మై సన్’’ అంటారు.. నేను తెలుగులో అన్నా, ఇది బూతా: వైసీపీ నేతలపై అయ్యన్న ఆగ్రహం

అనంతరం జోగి రమేశ్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్నపాత్రుడు మాట్లాడారని మండిపడ్డారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారని జోగి రమేశ్ తెలిపారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ఆయన ఆరోపించారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబని.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి జగన్ అని రమేశ్ చెప్పారు. శాంతియుతంగా నిరసన తెలిపిన మాపై దాడి చేస్తారా అని జోగి రమేశ్ మండిపడ్డారు. అయ్యన్నపాత్రుడిని ప్రేరేపించి మాట్లాడింది చంద్రబాబేనని ఆయన ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేస్తా..!| Chandrababu Powerful Speech | Asianet News Telugu
ఒకటే ఈలలు అరుపులు | Chandrababu Crazy Fans | Asianet Telugu