రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్‌కు వైవీ సుబ్బారెడ్డి సవాల్

By Siva KodatiFirst Published Aug 18, 2023, 5:58 PM IST
Highlights

వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీయేనని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండ, ఎర్రమట్టి దిబ్బలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ అధికారంలో వున్నప్పుడే ఎర్రమట్టి దిబ్బల దగ్గర ల్యాండ్ పూలింగ్ జరిగిందని.. రిషికొండపై అక్రమ నిర్మాణాలు వుంటే సుప్రీంకోర్ట్ వదిలేస్తుందా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. గీతం యూనివర్సిటీ అక్రమాలు పవన్‌కు కనపడవా..ఆయన ఎన్ని పర్యటనలు చేసినా రాష్ట్రంలో మళ్లీ గెలిచేది వైసీపీయేనని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు రద్దయ్యే ప్రమాదం వుందని ఆయన ఓటర్లను హెచ్చరించారు. 

అంతకుముందు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం పదవిపై తన ఆసక్తిని ఇప్పటికే చెప్పానని అన్నారు.పొత్తులపై చర్చలు జరుగుతున్నాయని పవన్ తెలిపారు . టీడీపీ-జనసేన ప్రభుత్వం, బీజేపీతో కలిసి వెళ్లడమా అనే దానిపై అనే దానిపై చర్చలు జరుగుతున్నాయని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడున్న పాలకులను బాధ్యులుగా చేస్తామన్నారు.

Also Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : సీఎం పదవి... పొత్తులపై మరోసారి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో క్రిమినాలిటీని లీగలైజ్ చేశారని పవన్ మండిపడ్డారు. రాయలసీమలో దోపిడి సాధ్యం కానందునే ఉత్తరాంధ్రపై పడ్డారని దుయ్యబట్టారు. ప్రతి పనికి రేట్ కార్డులు పెట్టి వైసీపీ నేతలు వసూళ్లకు పాల్పడుతున్నారని జనసేనాని ఆరోపించారు. రాష్ట్రాన్ని పన్నుల మయం చేశారని.. గ్రీన్ ట్యాక్స్ పేరుతో వేల కోట్లు వసూలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. 

click me!