గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరనున్నారు.
విజయవాడ: గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరనున్నారు. ఈ మేరకు ఆయన చంద్రబాబు అపాయింట్ మెంట్ కోరారు. వైసీపీకి ఆయన గుడ్ బై చెప్పారు. శుక్రవారంనాడు విజయవాడలో అనుచరులతో యార్లగడ్డ వెంకటరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అమెరికా నుండి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న పరిణామాలను వివరించారు. వైసీపీలో తనకు అవమానాలు జరిగాయని చెప్పారు. మూడు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కల్గించాయన్నారు. ఈ సమావేశంలో ప్రసంగిస్తూనే టీడీపీ చీఫ్ చంద్రబాబు అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. టీడీపీలో చేరుతానని ప్రకటించారు.
తాను పనికి వస్తానని భావిస్తే వచ్చే ఎన్నికల్లో తనకు గన్నవరం నుండి టిక్కెట్టు ఇవ్వాలని యార్లగడ్డ వెంకటరావు చంద్రబాబును కోరారు. గత ఎన్నికల్లో తనకు వైసీపీ టిక్కెట్టు ఇచ్చినందుకు జగన్ కు ధన్యవాదాలు చెప్పారు.గన్నవరం నుండి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని యార్లగడ్డ వెంకటరావు విశ్వాసం వ్యక్తం చేశారు.2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి యార్లగడ్డ వెంకటరావు పోటీ చేశారు.
undefined
అయితే టీడీపీ అభ్యర్ధి వల్లభనేని వంశీ చేతిలో యార్లగడ్డ వెంకటరావు స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతోవల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీకి మద్దతు పలికారు. దీంతో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు వర్గాల మధ్య సఖ్యత కుదరలేదు. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య రాజీకి పార్టీ నాయకత్వం ప్రయత్నించింది.
also read:గెలుపే అన్ని సమస్యలకు పరిష్కారం, సజ్జల వ్యాఖ్యలపై... : విజయవాడలో అనుచరులతో యార్లగడ్డ భేటీ
యార్లగడ్డ వెంకటరావును నియోజకవర్గ వ్యవహరాల్లో జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పింది. అయితే తన వర్గీయులను వంశీ ఇబ్బంది పెడుతున్నాడని యార్లగడ్డ వెంకటరావు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాడు. కానీ పార్టీ నాయకత్వం నుండి సరైన స్పందన లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుండి పోటీ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీలో చేరి ఈ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని వెంకటరావు ప్లాన్ చేసుకున్నారు.ఈ క్రమంలోనే ఇవాళ అనుచరులతో సమావేశమయ్యారు. రేపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించనుంది. లోకేష్ పాదయాత్రలో వెంకటరావు టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.