నిన్నటి వరకు వెంటిలేటర్‌పై వుండేది.. జనం అది కూడా పీకేశారు: టీడీపీపై సజ్జల సెటైర్లు

Siva Kodati |  
Published : Mar 14, 2021, 02:46 PM IST
నిన్నటి వరకు వెంటిలేటర్‌పై వుండేది.. జనం అది కూడా పీకేశారు: టీడీపీపై సజ్జల సెటైర్లు

సారాంశం

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి దక్కిన విజయం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆశీర్వాదం అన్నారు  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మున్సిపల్  ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి దక్కిన విజయం ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన ఆశీర్వాదం అన్నారు  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మున్సిపల్  ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి జనం బుద్ధి చెప్పారని సజ్జల తెలిపారు. అప్పుడు 151 సీట్ల మెజారిటీతో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. యువ నాయకుడు జగన్ ‌పై ఆశలు, నమ్మకం వుందని జనం పదే పదే గుర్తుచేస్తున్నారని రామకృష్ణారెడ్డి తెలిపారు.

ఆ ఎన్నికలు ముగిసిన 20 నెలల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీని రిజెక్ట్ చేస్తున్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శమని సజ్జల ఎద్దేవా చేశారు.

వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల  కోసం ఎలాంటి మేనిఫెస్టో విడుదల చేయలేదని, సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సైతం రాలేదని ఆయన గుర్తుచేశారు. అక్కడక్కడా ఫలితాలు నిరాశ పరిచినప్పటికీ, రాష్ట్రం మొత్తం వైసీపీ ప్రభంజనం వుందని సజ్జల తెలిపారు.

పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి.. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వుంటామని రామకృష్ణారెడ్డి వెల్లడించారు. 2014లో నోటి దాకా వచ్చిన అధికారం పోయినప్పటికీ ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించామని.. చౌకబారు రాజకీయాలు చేయలేదని సజ్జల చెప్పారు.

కానీ గడిచిన 20 నెలల్లో ప్రజా సమస్యలు పరిష్కరించేందేందుకు ఏ మాత్రం ప్రయత్నించలేదని.. చంద్రబాబు కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమం పేరుతో అధికార వికేంద్రీకరణను అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారని సజ్జల విమర్శించారు.

ఈ మోసాన్ని ప్రజలు గుర్తించి మంగళగిరిలో లోకేశ్‌ను చిత్తుచిత్తుగా ఓడించారని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న మొన్నటి వరకు టీడీపీ వెంటిలేటర్‌పై ఉండేదని.. ఇవాళ అది కూడా జనం పీకేశారని సజ్జల వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu