దొంగ దెబ్బలు కొడుతూనే వున్నారు: పరిషత్ ఎన్నికల రద్దుపై సజ్జల స్పందన

By Siva KodatiFirst Published May 21, 2021, 6:59 PM IST
Highlights

పరిషత్ ఎన్నికలు గతేడాది కరోనాతో వాయిదా పడ్డాయన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కష్టకాలంలోనూ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిందని సజ్జల తెలిపారు

పరిషత్ ఎన్నికలు గతేడాది కరోనాతో వాయిదా పడ్డాయన్నారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లిలో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కష్టకాలంలోనూ ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యిందని సజ్జల తెలిపారు.

పరిషత్ ఎన్నికలు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమన్నారు. ఓ యజ్ఞంలా పరిషత్ ఎన్నికలు పూర్తి చేశామని సజ్జల తెలిపారు. ఏ ఉద్దేశాలతో కోర్టులకు వెళ్లారో అందరికీ తెలుసునని.. నిమ్మగడ్డ హయం నుంచే ఈ దాగుడుమూతలు మొదలయ్యానని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

ఏదో ఒక కారణంతో దొంగ దెబ్బ కొట్టాలని చూస్తున్నారని... ప్రజాస్వామ్య ప్రక్రియకు ఆటంకం కలిగిందని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు. డివిజన్ బెంచ్ తీర్పుతోనే ఎస్ఈసీ ఎన్నికలు నిర్వహించారని... ప్రజాక్షేత్రంలో గెలవలేమని కుట్రలు పన్నుతున్నారని సజ్జల మండిపడ్డారు. ఎన్నికలు రద్దయ్యాయని సంతోషిస్తున్నారంటే ఏమనుకోవాలని రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

Also Read:మీరోక ఎస్ఈసీ, సీఎస్‌గా చేశారు.. ఇంగ్లీష్ అర్థం చేసుకోలేరా: నీలం సాహ్నిపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

కరోనా కష్టకాలంలో ఇంతమంది రిస్క్ తీసుకుని ఎన్నికలు పూర్తి చేశారని... ఇవి హైకోర్టుకు తెలియకుండా జరిగిన ఎన్నికలు కావు కదా అని సజ్జల ప్రశ్నించారు. టీడీపీ తీరు జుగుప్సాకరంగా వుందని మండిపడ్డారు. సీఐడీ కేసులో అభ్యంతరాలు ఏమీ లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని భావిస్తున్నామని సజ్జల తెలిపారు.

రఘురామకృష్ణంరాజు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసునని ఆయన గుర్తుచేశారు. రఘురామకృష్ణంరాజు పాత్రధారిగా టీడీపీ డ్రామాలు ఆడిందని సజ్జల ఆరోపించారు. అనేక ఆరోపణలు వున్న రమేశ్ ఆసుపత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని అడుగుతున్నారని ఆయన గుర్తుచేశారు.

ఎక్కడ నుంచి వచ్చింది ఈ రమేశ్ ఆసుపత్రి ప్రస్తావన అని సజ్జల ప్రశ్నించారు. రమేశ్ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయాలని ఎందుకు అడుగుతున్నారని రామకృష్ణారెడ్డి నిలదీశారు. ప్రభుత్వ ఆసుపత్రిపైనే విశ్వాసం లేదని అంటారా అంటూ ఆయన ఫైర్ అయ్యారు. సీఐడీ నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లిందన్నారు. 
 

click me!