చంద్రబాబుకు సజ్జల కౌంటర్: ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి

By narsimha lodeFirst Published Dec 18, 2020, 11:03 AM IST
Highlights

మూడు రాజధానులపై  రెఫరెండానికి సిద్దం కావాలని చంద్రబాబు చేసిన సవాల్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  స్పందించారు.

అమరావతి: మూడు రాజధానులపై  రెఫరెండానికి సిద్దం కావాలని చంద్రబాబు చేసిన సవాల్ కు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి  స్పందించారు.

మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనకు ఏడాది పూర్తైంది. దీన్ని పురస్కరించుకొని గురువారం నాడు రాయపూడిలో నిర్వహించిన సభలో వైసీపీకి చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. మూడు రాజధానులపై ప్రజల రెఫరెండం కోరాలని డిమాండ్ చేశారు. ప్రజలు మూడు రాజధానులకు ఒప్పుకొంటే తాను రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకొంటానని ఆయన ప్రకటించారు.

also read:లోకేష్‌ను పాతాళానికి తొక్కారు, వచ్చే ఎన్నికల్లో బాబుకు అదే గతి: కొడాలి నాని

వారి ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజలముందుకు వెళ్లారు. ‌గారు, కేసీఆర్‌గారిలానే చంద్రబాబుగారు కూడా తాను చెప్తున్న మాటలమీద ఆయనకు నమ్మకం ఉంటే ఇప్పుడు ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే, ప్రజలు ఎటువైపు ఉన్నారో తేలుతుంది కదా? (2/2)

— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala)

రెఫరెండంకు రెడీనా అని చంద్రబాబుగారు అడుగుతున్నారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏంచేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. కాంగ్రెస్‌ నుంచి వేరుపడ్డ సమయంలో జగన్‌గారు, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌గారు ఏంచేశారో మనకు తెలిసిందే. (1/2)

— Sajjala Ramakrishna Reddy (@SRKRSajjala)

చంద్రబాబు సవాల్ కు సజ్జల రామకృష్ణారెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. తాను నమ్మిన అంశాల మీద నమ్మకం, విశ్వాసం ఉండే నాయకులు ఏం చేశారో ఉమ్మడి రాష్ట్రంలో చూసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్ నుండి బయటకు వచ్చిన సమయంలో జగన్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జగన్ ఏం చేశారో తెలిసిందేనన్నారు.

తమ వెంట ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ప్రజల ముందుకు వెళ్లిన విషయాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని చంద్రబాబు నమ్మితే కేసీఆర్ మాదిరిగానే ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్తే ప్రజలు ఎటు ఉన్నారో తేలుతుందన్నారు.

click me!