తెలంగాణ కరోనా అప్ డేట్: 96.94 రికవరీ రేటుతో, గణనీయంగా తగ్గిన యాక్టివ్ కేసులు

Published : Dec 18, 2020, 10:01 AM ISTUpdated : Dec 18, 2020, 10:12 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 96.94 రికవరీ రేటుతో, గణనీయంగా తగ్గిన యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణ మెల్లిగా కరోనా మహమ్మారి కోరల్లోంచి బయటపడుతోంది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. తాజాగా గత 24గంటల్లో(బుధవారం రాత్రి 8 గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 47,991మందికి టెస్టులు చేయగా కేవలం 551 పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,80,195కి చేరితే మొత్తం టెస్టుల సంఖ్య 63,54,388కి చేరాయి. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 682 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,71,649కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,040 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  కేవలం ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1506కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.94శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే  జోగులాంబ గద్వాల 2, ఆదిలాబాద్ 8, కామారెడ్డి 3, నారాయణ పేట 1, భూపాలపల్లి 7, జనగామ 7, జగిత్యాల 11, వనపర్తి 6, అసిఫాబాద్ 8, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 10, మెదక్ 7, నాగర్ కర్నూల్ 13,  నిర్మల్ 6, నిజామాబాద్ 14,  సిరిసిల్ల 7, వికారాబాద్ 9, వరంగల్ రూరల్ 11,  ములుగు 10, పెద్దపల్లి 12, సిద్దిపేట 18, సూర్యాపేట 9, భువనగిరి 13, మంచిర్యాల 15, నల్గొండ 16, సంగారెడ్డి 23 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 111కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 42, రంగారెడ్డి 48, కొత్తగూడెం 21, కరీంనగర్ 24, ఖమ్మం 19,  వరంగల్ అర్బన్ 31కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు: 

 


 

PREV
click me!

Recommended Stories

Heavy Rain Alert : బంగాళాఖాతంలో తుపాను లోడ్ అవుతోందా? ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలతో అల్లకల్లోలం తప్పదా?
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu