రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరేంటీ : చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం

Siva Kodati |  
Published : Jul 06, 2022, 05:56 PM ISTUpdated : Jul 06, 2022, 06:01 PM IST
రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరేంటీ : చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం

సారాంశం

రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ వైఖరేంటీ అంటూ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమకు ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదంటూ ఆయన సెటైర్లు వేశారు. 

రాజ్యాంగపరమైన పదవుల్లో ఏకాభిప్రాయం వుండాలన్నారు వైసీపీ నేత (ysrcp) , ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). అందుకే రాష్ట్రపతి అభ్యర్ధిత్వానికి మద్ధతు ఇచ్చామని.. టీడీపీ (tdp) ఎందుకు తన వైఖరి ప్రకటించలేదని ఆయన ప్రశ్నించారు. తమకు ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ఆలోచన లేదని.. వైసీపీకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని సజ్జల స్పష్టం చేశారు. గతంలో స్పీకర్ గా కోడెల శివప్రసాద్ కి కూడా మద్ధతు ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. వెంకయ్య నాయుడు (venkaiah naidu) వుంటేనే మద్ధతు ఇచ్చి వుండేవారా అని సజ్జల నిలదీశారు. ఇప్పుడు చంద్రబాబు యశ్వంత్ సిన్హాకు సపోర్ట్ చేస్తారా అంటూ మండిపడ్డారు. 

ఇకపోతే.. ఈనెల 8,9 తేదీల్లో వైసీపీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి.  గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఈ ప్లీనరీ  నిర్వహించనున్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ ఆవిర్బావం తరువాత జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ప్లీనరీ కూడా ఇదే. 

ఈ ప్లీనరీ ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వడం.. ప్రజల అభివృద్దికి పాటు పడడమే ప్రధాన అజండాగా ఈ ప్లీనరీ సమావేశాలు జరగున్నాయి. వైసీపీ పార్టీ ఏర్పాటయ్యాక 2011లో మొదటి ప్లీనరీ ఇడుపుల పాయలో నిర్వహించారు. అధికారంలోకి రావడం.. వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నిలబెట్టుకున్నాం... అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ఏం చేశాం.. మిగిలిన రెండేళ్లలో ఏం చేయాలి అనేది ముఖ్యంగా చర్చించనున్నారు. 

దీనికి సంబంధించి.. ప్లీనరీ నిర్వహణకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్లను ఎంపిక చేశారు. ఆ వివరాలు ఇవే.. 

1. ప్లీనరీ నిర్వహణ కమిటీ - బొత్స సత్యనారాయణ
2. ఆహ్వన కమిటీ - వైవీ సుబ్బారెడ్డి
3. ప్రజా ప్రతినిధుల సమన్వయం - సజ్జల రామకృష్ణారెడ్డి
4. వేదిక, ప్రాంగణం నిర్వహణ - తలశిల రఘురాం
5. సభా నిర్వహణ కమిటీ - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
6. స్టేజ్‌ ప్రోటోకాల్‌ - తానేటి వనిత
7. అలంకరణ కమిటీ - వెల్లంపల్లి శ్రీనివాస్‌
8. వసతి ఏర్పాట్ల కమిటీ - కొలుసు పార్థసారధి
9. తీర్మాణాల కమిటి - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
10. ప్రతినిధులు, పాస్‌లు - గుడివాడ అమర్నాథ్‌
11. భోజన వసతుల కమిటీ - చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
12. పార్టీ అధ్యక్ష ఎన్నికల కమిటీ -  ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
13. పార్టీ రాజ్యాంగ సవరణల కమిటీ - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
14. మీడియా, ఫోటో ఎగ్జిబిషన్‌ కమిటీ - పేర్ని నాని
15. హెల్త్‌ కమిటీ - డాక్టర్‌ సీదిరి అప్పలరాజు
16. కల్చరల్‌ కమిటీ - వంగపండు ఉష
17. వాలంటీర్స్‌ కమిటీ - గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
18. రవాణా కమిటీ - చిన్నశ్రీను
19. ఆడిటోరియం నిర్వహణ కమిటీ - లేళ్ల అప్పిరెడ్డి 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?