మంత్రి ఉషశ్రీ చరణ్‌పై కబ్జా ఆరోపణలు.. హైకోర్టులో పిటిషన్, ప్రభుత్వానికి నోటీసులు

Siva Kodati |  
Published : Jul 06, 2022, 03:16 PM IST
మంత్రి ఉషశ్రీ చరణ్‌పై కబ్జా ఆరోపణలు.. హైకోర్టులో పిటిషన్, ప్రభుత్వానికి నోటీసులు

సారాంశం

వైసీపీ నేత, మంత్రి ఉషశ్రీ చరణ్ వివాదంలో ఇరుక్కున్నారు. కళ్యాణదుర్గంలోని 100 ఎకరాల చెరువును కబ్జా చేసి మంత్రి దానిని ఫ్లాట్ల కింద విక్రయిస్తున్నారని టీడీపీ నేత ఉమామహేశ్వర నాయుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

కళ్యాణదుర్గంలో 200 ఎకరాల చెరువును మంత్రి ఉషశ్రీ చరణ్ కబ్జా చేస్తున్నారంటూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఉమామహేశ్వర నాయుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. 100 ఎకరాల చెరువును పూడ్చి .. ప్లాట్లుగా మార్చి అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని పిటిషన్ లో తెలిపారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిని విచారణకు స్వీకరించింది న్యాయస్థానం . కళ్యాణదుర్గంలోని సర్వే నెంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని కబ్జా చేశారని పిటిషన్ లో తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా కలెక్టర్ , ఆర్డీవోలను ప్రతివాదులుగా చేర్చారు పిటిషనర్. రెండు వారాల్లో దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?