ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడిస్తున్నాడని వైఎస్ఆర్‌సీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
అమరావతి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో చంద్రబాబునాయుడు డ్రామాలు ఆడిస్తున్నాడని వైఎస్ఆర్‌సీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడలో వైసీపీ అభ్యర్ధి అప్పన్నతో నామినేషన్ వేయకుండా అడ్డుకొన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ విషయం ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టికి తీసుకొచ్చినట్టుగా చెప్పారు. కానీ ఆయన ఈ విషయమై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
also read:నిమ్మగడ్డపై మంత్రుల ఫిర్యాదు: వారం తర్వాత భేటీ కానున్న ప్రివిలేజ్ కమిటీ
మరో వైపు తూర్పుగోదావరి జిల్లా గొల్లలకుంటలో టీడీపీ సర్పంచ్ భర్త అనుమానాస్పదస్థితిలో మరణించిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందన్నారు.
కానీ ఈ ఘటన జరిగిన గ్రామాన్ని ఎస్ఈసీ రమేష్ కుమార్ పరిశీలించడంతో దీని వెనుక ఎవరున్నారో అర్ధం అవుతోందన్నారు.అన్ని గ్రామాల్లో ఎన్నికలు పెట్టాలంటున్న చంద్రబాబునాయుడు అచ్చెన్నాయుడు గ్రామంలో పోటీ పెట్టకూడదా అని ఆయన ప్రశ్నించారు.
ఎన్నికల సంఘం యాప్ పై ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఈసీ యాప్ లేదా ప్రభుత్వ యాప్ ను ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.ఇప్పటికే తమ అభ్యంతరాలు ఎస్ఈసీకి చెప్పినట్టుగా ఆయన తెలిపారు.కేంద్ర ఎన్నికల సంఘం యాప్ సి విజిల్ ను ఉపయోగించాలని ఆయన కోరారు.క్షేత్రస్థాయి సమాచారం కేంద్ర కార్యాలయానికి చేరుతోంది. ఇక్కడ నుండే ఎస్ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు