ధైర్యం లేదు.. ఎప్పడూ ఎవరివో ఊతకర్రలు పట్టుకోవాల్సిందే: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

By Siva KodatiFirst Published Jan 5, 2022, 3:47 PM IST
Highlights

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విరుచుకుపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . చంద్రబాబు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని ఎద్దేవా చేశారు. 

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడుపై (chandrababu naidu) విరుచుకుపడ్డారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) . బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని సజ్జల ధ్వజమెత్తారు. చంద్రబాబు అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ... జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చారని గుర్తు చేశారు. రెండున్నరేళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పలితం ఒకే విధంగా వస్తోందని తెలిపారు.

కుప్పంలో (kuppam) టీడీపీ అడ్రస్‌ లేకుండా పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా సజ్జల రామకృష్ణారెడ్డి చేశారు. చంద్రబాబు శాపనార్థాలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదని... జూమ్ కాన్ఫరెన్సులు చంద్రబాబుకి రోజువారీ దినచర్యగా మారిందన్నారు. సెల్‌ఫోన్ల దగ్గరి నుంచి బిల్‌క్లింటన్ వరకు అన్నీ మాట్లాడుతూ ఉంటారని సజ్జల చురకలు వేశారు. చంద్రబాబు తప్పులు చేయబట్టే జనం దండం పెట్టి ఆయన్ని పాలన నుంచి సాగనంపారని రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. ప్రజలు తనను ఎందుకు నమ్మటం లేదని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. 

Also Read:రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టింది: పార్టీ నేతల సమావేశంలో చంద్రబాబు

ఆయన టీడీపీ కార్యకర్తల్లో కూడా నిస్తేజం పోనివ్వలేకపోయాడని దుయ్యబట్టారు. ఢీ అంటే ఢీ అనే వారికి టిక్కెట్లు అంటున్నారని... మరి కుప్పంలో స్థానిక ఎన్నికలలో ఓటమి చెందినందున మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటూ సజ్జల కామెంట్ చేశారు. అన్నక్యాంటీన్లు, రంజాన్ తోఫా, ఇతర కానుకలు తీసేశామన్నారు. అన్నిటిలోనూ విపరీతంగా అవినీతి చేసి దోచుకున్నారని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గల్లీ రాజకీయాలు చేయటం చంద్రబాబుకు అలవాటని... ప్రజల కోసం ఇది చేస్తామని గట్టిగా చెప్పుకుని జనంలోకి వెళ్లలేని వ్యక్తంటూ దుయ్యబట్టారు. ధైర్యంగా ఎన్నికలకు వెళ్లలేడు కాబట్టే ఎప్పుడూ ఎవరివో ఊతకర్రలు పెట్టుకుని వెళ్లటమే చంద్రబాబు పని’అని సజ్జల విమర్శలు గుప్పించారు.

మరోవైపు ఈ నెల 8వ తేదీన వరి ధాన్యం కొనుగోలుపై, ఈ నెల 11న నిత్యావసర ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు చేయాలని టీడీపీ చీఫ్  చెప్పారు.బుధవారం నాడు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో  నియోజకవర్గ ఇంచార్జీలతో టీడీపీ చీఫ్ Chandrababu సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.రాష్ట్రం కోలుకోవడానికి  చాలా సమయం పడుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా బాధితులేనని చంద్రబాబు విమర్శించారు.ఐపీఎస్, ఐఎఎస్ వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించారని చంద్రబాబు వైసీపీ సర్కార్ పై మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి Ycp గ్రహణం పట్టిందన్నారు.మూడేళ్లలో రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదన్నారు.జగన్ ప్రభుత్వం అన్ని  వ్యవస్థలను నాశనం చేసిందని ఆయన విమర్శించారు. ఇంటి నుండి బయటికొస్తే కేసులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు వైసీపీపై మండిపడ్డారు. జగన్ తీసుకొన్న మూర్ఖపు నిర్ణయాలు, పిచ్చి పాలనతో ఏపీ కోలుకోలేని పరిస్థితికి వెళ్లిందన్నారు. ఇంత దారుణమైన పాలనను తాను ఏనాడూ చూడలేదన్నారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రం నష్టపోయిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 

click me!