ప్రకాశంలో కలకలం, ముగ్గురు ఒమిక్రాన్ రోగుల అదృశ్యం.. అధికారుల గాలింపు

By Siva KodatiFirst Published Jan 5, 2022, 2:34 PM IST
Highlights

ప్రకాశం జిల్లాలో (prakasam district) ముగ్గురు ఒమిక్రాన్ రోగులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరు యూకే నుంచి మరొకరు యూఎస్ నుంచి వచ్చినట్నలు అధికారులు గుర్తించారు. ఒంగోలులో ఒకరికి, చీరాలలో ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చింది. దీంతో బాధితుల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

ప్రకాశం జిల్లాలో (prakasam district) ముగ్గురు ఒమిక్రాన్ రోగులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరు యూకే నుంచి మరొకరు యూఎస్ నుంచి వచ్చినట్నలు అధికారులు గుర్తించారు. ఒంగోలులో ఒకరికి, చీరాలలో ఇద్దరికి ఒమిక్రాన్ వచ్చింది. దీంతో బాధితుల ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. 

మరోవైపు దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా విజృంభణ కొనసాగుతుంది. కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) కూడా వేగంగా వ్యాప్తి చెందుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. యూఎస్ నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఓ మహిళకు మాత్రం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి ఒమిక్రాన్ సోకింది. బాధితుల్లో  గుంటూరు జిల్లాలో ఒక మహిళతో పాటుగా.. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నారు. ఇక, తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. 

Also Read:భారత్‌లో మళ్లీ కరోనా విజృంభణ.. ఒక్క రోజే 58 వేలకు పైగా కొత్త కేసులు.. 2 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు

ఇక, ఏపీలో నిన్న కొత్తగా 7 ఒమిక్రాన్ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వారిలో ఒమన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు, దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు, అమెరికా, సుడాన్, గోవా నుంచి వచ్చిన ఒక్కరి చొప్పున ఉన్నారు. బాధితుల్లో ముగ్గురు కృష్ణా జిల్లాకు చెందినవారు కాగా, మిగిలిన నలుగురు ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవారు. వారిలో ఒకరు  ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌నీ,  ప్ర‌స్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ లో వెల్లడించింది. మిగతా వారి పరిస్థితి సాధారణంగానే ఉంద‌ని తెలిపారు.  వీరందర్నీ ఐసోలేషన్‌లో ఉంచినట్లు పేర్కొంది.

దేశంలో ఇప్పటివరకు 2,135 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం తెలిపింది. వీరిలో ఇప్పటివరకు 828 మంది కోలుకున్నారు. ఒమిక్రాన్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 653 నమోదయ్యాయి. ఆ తర్వాత 464 కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

click me!