ఎంపీ గోరంట్ల మాధవ్ తప్పున్నట్లు తేలితే .. చర్యలు తప్పవు : తేల్చేసిన సజ్జల రామకృష్ణారెడ్డి

By Siva Kodati  |  First Published Aug 4, 2022, 5:03 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్‌పై పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు.


ఎంపీ గోరంట్ల వివాదంపై స్పందించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... దీనిపై ఎంపీ ఫిర్యాదు చేశారని, దర్యాప్తు జరుగుతోందన్నారు. మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్‌పై పార్టీపరంగా చర్యలు తీసుకుంటామని సజ్జల స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహించదని రామకృష్ణారెడ్డి అన్నారు. నిజమని తేలితే అందరికీ ఒక గుణపాఠంలా చర్యలు ఉంటాయని సజ్జల పేర్కొన్నారు. చేసిన పనిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామని రామకృష్ణారెడ్డి తెలిపారు. కార్యకర్తలను సీఎం జగన్ కలవడం ప్రణాళికలో భాగంగానే జరుగుతోందనపి సజ్జల స్పష్టం చేశారు. 

మరోవైపు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు.  Morphing  చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు.  ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్  వివరించారు.  ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.

Latest Videos

అశ్లీల వీడియో వెనుక టీడీపీ కుట్ర: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నారన్నారు. ఈ విషయమై ఏ విచారణకైనా సిద్దమేనన్నారు.  ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు కూడా తాను సిద్దమేనన్నారు. ఓ వీడియోలో ఉన్నట్టుగా తనను మార్పింగ్ చేశారని  ఆయన ఆరోపించారు. ధైర్యముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసిందన్నారు. ఈ వీడియో వెనుక వాస్తవాలను తేల్చాలని తాను పోలీసులను కోరిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.
 

click me!