అశ్లీల వీడియో వెనుక టీడీపీ కుట్ర: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు చెందిన అశ్లీల వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.ఈ విషయమై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. దీని వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందన్నారు.

Hindupur MP Gorantla Madhav Clarifies On Obscene video

హిందూపురం: సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆశ్లీల వీడియో వెనుక టీడీపీ నేతల కుట్ర ఉందని హిందూపురం ఎంపీ Gorantla Madhav ఆరోపించారు.  హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్న Obscene videoపై గురువారం నాడు స్పందించారు.  Morphing  చేసి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని మాధవ్ ఆరోపించారు.  ఈ వీడియో విషయమై ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని ప్రకటించారు. ఈ విషయమై ఎస్పీకి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టుగా ఎంపీ మాధవ్  వివరించారు.  ఈ కుట్ర వెనుక టీడీపీకి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణలున్నారని ఆయన ఆరోపించారు. తనపై కుట్ర పన్నిన ముగ్గురిపై పరువు నష్టం దావా వేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పారు.

తనను అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు పన్నారన్నారు. ఈ విషయమై ఏ విచారణకైనా సిద్దమేనన్నారు.  ఈ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి టెస్టుకు కూడా తాను సిద్దమేనన్నారు. ఓ వీడియోలో ఉన్నట్టుగా తనను మార్పింగ్ చేశారని  ఆయన ఆరోపించారు. 

ధైర్యముంటే తనను నేరుగా ఎదుర్కోవాలని కూడా ఆయన టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి తనను డ్యామేజీ చేయాలని చూస్తున్నారని ఎంపీ అభిప్రాయపడ్డారు. తనను ఇబ్బంది పెట్టేందుకు టీడీపీ కుట్ర చేసిందన్నారు. ఈ వీడియో వెనుక వాస్తవాలను తేల్చాలని తాను పోలీసులను కోరిన విషయాన్ని మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఈ వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కుట్రలో ఉన్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామని ఎంపీ తెలిపారు. ఈ విషయమై  ప్రెస్ కౌన్సిల్ ను కూడా ఆశ్రయిస్తానన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో కూడా పిల్ దాఖలు చేస్తానని కూడా ఎంపీ తెలిపారు. ఈ వీడియోలో ఉన్నది తానేనని నిరూపిస్తే తన తల నరుక్కొంటానని కూడా ఆయన చెప్పారు. ఈ వీడియో  ఆధారంగా కథనాలు ప్రసారం చేసిన ఓ మీడియా చానెల్ పై ప్రెస్ కౌన్సిల్ కు కూడా ఫిర్యాదు చేస్తానని కూడా ఆయన తేల్చి చెప్పారు. 

నగ్నంగా  తాను  ఓ మహిళతో మాట్లాడుతున్నట్టుగా వీడియోను మార్ఫింగ్ చేశారని ఎంపీ చెప్పారు. ఈ వీడియో అసలుతో నకిలీదో తేల్చాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఈ వీడియోను పంపి ఈ విషయాన్ని తేల్చాలని ఆయన కోరారు.సోషల్ మీడియాలో ఈ వీడియో చక్కర్లు కొడుతున్న విషయమై విపక్షాలు మండిపడుతున్నాయి.ఈ విషయమై విచారణ చేసి ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios