మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం జగన్.. అనారోగ్యంతో ఉన్న బాలుడికి వైద్యం అందించాలని ఆదేశం

By Sumanth KanukulaFirst Published Aug 4, 2022, 3:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ జిల్లాలో తునిలో అనారోగ్యంతో ఉన్న బాలుడిని గమనించిన సీఎం జగన్.. సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు. కాకినాడ జిల్లాలో తునిలో జనాల మధ్య చంటిబిడ్డతో ఉన్న ఓ మహిళను గుర్తించిన సీఎం జగన్.. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపించి, వాహనం నుంచి దిగారు. ఆమె వద్దకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో ఆమె తన బిడ్డ అనారోగ్యంతో బాధపడుతున్నాడని సీఎం జగన్‌కు చెప్పింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించింది. తన కొడుకును ఆదుకోవాలని కోరింది. దీంతో సీఎం జగన్ వెంటనే సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇక, ఆ మహిళ పేరు తనూజ కాగా.. ఆమె స్వస్థలం ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం. ఆమె కొడుకు కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 

ఇక, సీఎం జగన్ ఈ రోజు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కూతురు వివాహానికి హాజరయ్యారు. ఇందుకోసం సీఎం జగన్ ఈరోజు ఉదయం తాడేపల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి.. తుని చేరుకన్నారు. అక్కడ పలువురు మంత్రులు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్ అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పాయకరావుపేట చేరుకున్నారు. పెదపాటి అమ్మాజీ కుమార్తె కార్యక్రమంలో పాల్గొని.. వధువు డయానా చంద్రకాంతం, వరుడు సుధీర్‌ కుమార్‌లను ఆశీర్వదించారు. 

click me!