టీడీపీ పోటీలో లేదు కాబట్టి మేం గెలిచామంట: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Sep 19, 2021, 06:42 PM ISTUpdated : Sep 19, 2021, 06:45 PM IST
టీడీపీ పోటీలో లేదు కాబట్టి మేం గెలిచామంట: పరిషత్ ఫలితాలపై సజ్జల వ్యాఖ్యలు

సారాంశం

తెలుగుదేశం పార్టీ మొత్తం ఐపీ పెట్టిందా అన్నట్లు వుందంటూ   రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. మేం పోటీలో లేని ఎన్నికల్లో గెలిచారని టీడీపీ నేతలు అంటున్నారని.. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని టీడీపీ నేతలు వితండవాదం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు

పరిషత్ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మొత్తం ఐపీ పెట్టిందా అన్నట్లు వుందంటూ ఆయన సెటైర్లు వేశారు. మేం పోటీలో లేని ఎన్నికల్లో గెలిచారని టీడీపీ నేతలు అంటున్నారని.. మళ్లీ ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని టీడీపీ నేతలు వితండవాదం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ కుట్రలు ఫలించలేదని.. సీఎం జగన్ పాలనకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని సజ్జల తెలిపారు. 98 శాతం జెడ్పీటీసీల్లో వైసీపీ గెలిచిందని.. పరిషత్ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకోవడం పెద్ద డ్రామా అని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రక్రియ జరగడం దేశంలోనే తొలిసారి అని సజ్జల పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
PMMVY Scheme : తెలుగు మహిళలకు బంపరాఫర్.. ప్రభుత్వమే ఫ్రీగా రూ.6,000 అకౌంట్లో వేసే సూపర్ స్కీమ్