స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,337 మందికి పాజిటివ్, 20,35,795కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Sep 19, 2021, 05:42 PM IST
స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు... కొత్తగా 1,337 మందికి పాజిటివ్, 20,35,795కి చేరిన సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 1,337 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,282 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,699 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,337 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,35,795కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,070కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణ 3, ప్రకాశం 1, పశ్చిమ గోదావరి 1, చిత్తూరు 3, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,282 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,07,026కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 68,568 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,77,21,082కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 14,699 మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 10, చిత్తూరు 231, తూర్పుగోదావరి 198, గుంటూరు 141, కడప 90, కృష్ణ 144, కర్నూలు 3, నెల్లూరు 139, ప్రకాశం 161, శ్రీకాకుళం 23, విశాఖపట్నం 51, విజయనగరం 18, పశ్చిమ గోదావరిలలో 128 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Vemireddy Prashanthi Emotional Speech In Mahanadu | వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు