ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం... వైఎస్సార్‌సిపి నేత కామిరెడ్డి సోదరుడి మృతి

By Arun Kumar PFirst Published Feb 24, 2019, 1:21 PM IST
Highlights

ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ఎదురెదురుగా వచ్చిన ఆర్టీసి బస్సు-కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కామిరెడ్డి ఆదిత్య(30) అనే యువకుడు మృతిచెందాడు. మరో వృద్దురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
ఈ ప్రమాదంలో మృతిచెందిన యువకుడు వైఎస్సార్‌సిపి నేత కామిరెడ్డి నాని సోదరుడు. ఇటీవల దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టింగ్ లు చేసిన నానిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  అతడి అరెస్టుకు వ్యతిరేకంగా ఏలూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో మృతుడు ఆదిత్య కూడా పాల్గొన్నారు. 

అయితే శనివారం సోదరుడు నానికి బెయిల్ రావడంతో ఆదిత్య అక్కడి నుండి బంధువుల ఇంటికి వెళ్లాడు. ఇవాళ ఉదయం తిరిగి ఇంటికి వస్తుండగా అతడు ప్రయాణిస్తున్న కారు పెదవేగి మండలం వేగివాడ గ్రామ శివారులోకి రాగానే ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును మితిమీరిన వేగంతో ఢీకొట్టడంతో ఆదిత్య అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.   

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

click me!