లోకేష్...మోడీ సంగతి తర్వాత ముందు నీ బాడీ సంగతి చూసుకో: విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు

By Arun Kumar PFirst Published Feb 24, 2019, 12:46 PM IST
Highlights

వైఎస్సార్‌సిపి ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేష్ పై ట్విట్టర్ వేదికన విరుచుకుపడ్డారు. ఇటీవల టిడిపిని ఓడించడానికి జగన్ కు ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయిరెడ్డి కాస్త వ్యంగ్యంగా స్పదించారు. ''డియర్ లోకేష్, మీ నాన్నని ఓడించటానికి, నువ్వు మా కళ్ళ ఎదుట ఇక్కడే ఉండగా... మాకు మోడీ, కెసిఆర్ లతో ఏంపని చెప్పు? తప్పమ్మా, ఇలాంటి మాటలు మాట్లాడితే కళ్ళు పోతాయ్, లెంపలేసుకో!'' అంటూ ట్వీట్ చేశారు. 

అలాగే జగన్, కేసీఆర్ లను ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అంటూ లోకేష్ ఇటీవల చేసిన ట్వీట్లపై కూడా విజయసాయి రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. లోకేష్ మోడీ గురించి  ఆలోచించడం మాని బాడీ(శరీరం) గురించి  ఆలోచిస్తే మంచిదంటూ సలహా ఇచ్చారు. ''లోకేష్, నీకు జగన్ గారిలోనూ కెసిఆర్ గారిలోనూ మోడీ గారు కనిపిస్తున్నారా? ఆంధ్ర మోడీ, తెలంగాణ మోడీ అని వ్యగంగా ట్వీట్ చేసావు. మోడీ సంగతి తర్వాత ఆలోచిద్డువులే, ముందు నీ బాడీ ముఖ్యంగా మైండ్ సంగతి ఆలోచించు! ఎక్కడన్నా మంచి గ్యారేజ్ లో చూపించుకో. మతిస్థిమితం లేని వాళ్ళు మంత్రిగా అనర్హులు.'' అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. 

ఇక జగన్ ఇంగ్లాండ్ పర్యటనపై టిడిపి చేస్తున్న ఆరోపణలను మరో ట్వీట్ ద్వారా విజయసాయి రెడ్డి తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ''తెలంగాణా ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు పంపించిన 50 లక్షలు హవాలా డబ్బు ఏ అకౌంట్ నుంచి తీసిచ్చారో ముందు మీరు జవాబు చెప్పండి చంద్రబాబూ. వీడియో కెమెరాలో రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయారు గదా. మీరు సిఎం అయ్యాకే తెలుగు రాష్ట్రాల్లో హవాలా, హుండీ చీకటి వ్యాపారాలు పుంజుకున్నవిషయం వాస్తవం కాదా?'' అని ముఖ్యమంత్రిని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. 

click me!