జగన్ సుపరిపాలన వల్లే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.
గుంటూరు: జగన్ సుపరిపాలన వల్లే మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్ స్వీప్ సాధించిందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పారు.
ఆదివారం నాడు ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.21 మాసాల అద్భుత పాలనను ధైర్యంగా ఎన్నికలకు వెళ్తే ప్రజలు తమ పార్టీని ఆదరించారని ఆయన చెప్పారు.రాష్ట్రంలో ప్రతిపక్షం లేదన్నారు. ప్రతిపక్షానికి తోక పార్టీయైన పవన్ కళ్యాణ్ పార్టీ కూడ లేదన్నారు.
1983 నండి తాను రాజకీయాలను గమనిస్తున్నానని ఆయన తెలిపారు. ఇంత అద్భుతమైన ఫలితాలు అధికార పార్టీకి ఏనాడూ చూడలేదన్నారు. ఇంత వరస్ట్ ఫలితాలు విపక్ష పార్టీలకు దక్కడం తాను చూడలేదని చెప్పారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వస్తోంటే చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ లు రాష్ట్రం వదిలి హైద్రాబాద్ లో దాక్కొన్నారని ఆయన విమర్శించారు. ఈవీఎంలైనా, బ్యాలెట్ పేపర్లపైనా తామే విజయం సాధించామన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలను వైసీపీ అమలు చేసిందన్నారు. ఈ సంక్షేమ పలితాలను అమలు చేసినందుకు ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం అవుతోందన్నారు. టీడీపీ కార్యకర్తలు తమ దారులను వెతుక్కోవాలని ఆయన సూచించారు.