వల్లభనేని వంశీపై మాట్లాడబోను: యార్లగడ్డ వెంకట్రావు

By narsimha lodeFirst Published Nov 20, 2019, 11:23 AM IST
Highlights

తాను ఏపీ సీఎం వైఎస్ జగన్ విధేయుడిని, జగన్ ఆదేశాల మేరకు తాను నడుచుకొంటానని  వైసీపీ గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.  వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు.

గన్నవరం: తాను ఏపీ సీఎం వైఎస్ జగన్ విధేయుడిని, జగన్ ఆదేశాల మేరకు తాను నడుచుకొంటానని  వైసీపీ గన్నవరం అసెంబ్లీ ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై తాను స్పందించబోనని తేల్చి చెప్పారు.

బుధవారం నాడు వైసీపీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడారు.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం తాను  ప్రయత్నిస్తానని వైసీపీ గన్నవరం ఇంచార్జీ యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. వంశీ నన్ను కలవలేదు, వల్లభనేని వంశీ నాతో కలిసి పనిచేస్తానని చెప్పిన విషయం తాను మీడియాలోనే చూసినట్టుగానే వెంకట్రావు చెప్పారు.

Also Read:వైసీపీలోకి వల్లభనేని వంశీ: యార్లగడ్డ గరంగరం, జగన్ వద్దకు పంచాయతీ

సీఎం జగన్‌ను తాను కలిసిన సమయంలో  నియోజకవర్గ అభివృద్దితో పాటు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ కార్యకర్తల అభిప్రాయాలను తాను వివరించినట్టుగా ఆయన తెలిపారు. తమ సమావేశంలో పెద్దగా వల్లభనేని వంశీ గురించి ఎలాంటి చర్చ జరగలేదని ఆయన చెప్పారు.

వల్లభనేని వంశీ వ్యాఖ్యలపై తాను చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు మంచి చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టుగా యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.

తాను ఎవరిపై కేసులు పెట్టించలేదని పరోక్షంగా వల్లభనేని వంశీపై  యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. రాబోయే పరిణామాల గురించి తాను ఊహించి చెప్పలేనన్నారు.  వల్లభనేని వంశీ వైసీపీలో చేరిన తర్వాత తాను మాట్లాడుతానని చెప్పారు.

తాను వల్లభనేని వంశీ కోసం పార్టీలో చేరలేదు. వైఎస్ జగన్ విధేయుడిని... జగన్ ఆదేశాల మేరకు తాను నడుచుకొంటానని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.జగన్ కోసం తాను పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. తాను పార్టీలు మారే మనిషిని కాదని  యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. 

తనపై ఎలాంటి పోలీసు కేసులు లేవని పరోక్షంగా వల్లభనేని వంశీపై యార్లగడ్డ వెంకట్రావు సెటైర్లు వేశారు.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రతి  ఇంటి గడప తొక్కినట్టుగా ఆయన చెప్పారు. 

Also read:మంత్రి గంటాకు షాక్: ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, వేలంలో ఇల్లు కూడా.....

సీఎం జగన్‌కు తనపై 200 శాతం నమ్మకం ఉందన్నారు. వల్లభనేని వంశీప్రభుత్వ పథకాలకు, ఆకర్షితులయ్యాడా అధికారుల వేధింపులకు ఆకర్షితులయ్యాడా అనే విషయమై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని  యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.

తాను సన్మానం చేస్తానని ఎవరితో చెప్పలేదన్నారు. ఊహజనిత ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనని వల్లభనేని వంశీ చెప్పారు. తన నియోజకవర్గంలో  స్థానిక సంస్థల ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను కైవసం చేసుకొంటామని యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు

చట్టం తన పని తాను చేసుకొంటు వెళ్తోందని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు. ఎన్నికల సమయంలో  టీడీపీ కార్యకర్తలు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారని యార్లగడ్డ వెంకట్రావు చెప్పారు.  వల్లభనేని వంశీ పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు దొంగ పట్టాలే అని యార్లగడ్డ వెంకట్రావు కుండబద్దలు కొట్టారు.

వల్లభనేని వంశీ పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు నిజమైనవే అయిత తాను అదే లబ్దిదారులకే ఎందుకు ఇళ్ల పట్టాలను ఇవ్వాలని ఎందుకు సీఎంను కోరుతానని చెప్పారు.వల్లభనేని వంశీ ఎప్పుడు వైసీపీలో చేరుతున్నాడో ఆయనే అడగాలని చెప్పారు.  తాను సన్మానాలు చేసుకోవడానికి  కూడ సిద్దంగా లేను, సన్మానాలు చేయడానికి కూడ తాను సిద్దంగా లేనన్నారు.

తాను సీఎంను కలిసి వచ్చే సమయంలో తనకు జిల్లాకు చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు తనకు కలిసినట్టుగా ఆయన తెలిపారు. తనకు క్యారెక్టర్ ఉంది, పూటకో మాట, రోజుకో రకంగా మాట్లాడనని ఆయన తెలిపారు.

 
 

click me!