లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమా... జేసీ కి చిక్కులు

Published : May 14, 2019, 11:45 AM IST
లక్ష్మీఎస్ ఎన్టీఆర్ సినిమా... జేసీ కి చిక్కులు

సారాంశం

టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు కడప జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) కోటేశ్వరరావుకి చిక్కులు తెచ్చిపెట్టాయి.

టీడీపీ వ్యవస్థాపకుడు, సినీ నటుడు ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు కడప జిల్లా జాయింట్ కలెక్టర్(జేసీ) కోటేశ్వరరావుకి చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయనను ఎన్నికలకు సంబంధం లేని విధులకు బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల వేళ దేశంలో పలువురు నేతల బయోగ్రఫీ చిత్రాలు రూపొందాయి. 

ఇందులో భాగంగా రాంగోపాల్‌ వర్మ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రాన్ని రూపొందించారు. వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు వర్మ చంద్రబాబుకు వ్యతిరేకంగా సినిమా రూపొందించారని టీడీపీ శ్రేణులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.  ఎన్నికలు పూర్తయ్యేవరకు బయోగ్రఫీ చిత్రాలను విడుదల చేయకూడదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే మే 1న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను రాంగోపాల్‌వర్మ విడుదల చేశారు.

కడపలోని కొన్ని థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. ఈ విషయం రాష్ట్ర ఎన్నికల అధికారి దృష్టికి వెళ్లింది. ఎన్నికల నియమావళి ప్రకారం లక్ష్మీ్‌స ఎన్టీఆర్‌ సినిమాను అడ్డుకోవడంలో జేసీ విఫలమయ్యారని ఆయనకు ఎన్నికలకు సంబంధంలేని పోస్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. ద్వివేది సిఫారసును కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించడంతో జాయింట్‌ కలెక్టర్‌ను ఎన్నికలకు సంబంధం లేని బాధ్యతను అప్పజెప్పనున్నారు.

PREV
click me!

Recommended Stories

Kakinada : గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా కాకినాడ.. చంద్రబాబు, పవన్ స్కెచ్ మామూలుగా లేదుగా !
YCP Leaders Submit Petition to DGP Office Seeking Justice in Salman MurderCase | Asianet News Telugu