
పెద్ద నోట్ల రద్దు సమస్యలకు పరిష్కారం చూపే సిఎంల కమిటికి చంద్రబాబునాయడుకు సారధ్యం అప్పగించటమంటే దొంగచేతికి తాళాలు అప్పజెప్పటమేనట. వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కేంద్రంపై పెద్ద ఎత్తున ధ్వజమెత్తారు. మీడియాతో మాట్లాడుతూ, నల్లధన కుబేరునిగా చంద్రబాబు ప్రచారంలో ఉన్నారంటూ వాసిరెడ్డి ఆరోపించారు. తన అక్రమ సంపాదన మొత్తాన్ని విదేశాలకు తరలిస్తున్నారని కూడా మండిపడ్డారు.
నోట్ల రద్దుకు ముందుగానే తెలంగాణాలోని హెరిటేజ్ వాటాను ఫ్యూచర్ గ్రూపుకు అమ్మేసుకున్న చంద్రబాబు సమర్ధత చూసిన తర్వాతనే కేంద్రం కమిటికి సారధ్యం అప్పగించి ఉంటుదని ఎద్దేవా చేసారు. తప్పు ఒకరు చేస్తే మరోకరిపై బాధ్యత మోపటంలో చంద్రబాబు అందెవేసిన చేయన్న విషయం తెలిసే ఆయనకు సారధ్యం అప్పగించారా అని ప్రశ్నించారు.
తన సారధ్యం వల్ల కమిటీలోని మిగిలిన నాలుగు రాష్ట్రాలను కూడా నేరమయం చేయగలిగిన ఘటికుడు చంద్రబాబుని వాసిరెడ్డి చెప్పారు. నోట్ల రద్దు వల్ల తలెత్తిన సమస్యలను కేంద్రానికి లేదా ప్రధానమంత్రికి కనీసం ఓ లేఖ కూడా రాయని చంద్రబాబు గురించి ఏమని అర్దం చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఎంతసేపు సూటుకేసు, లోకేషు గురించే తప్ప సామాన్యుల సమస్యలు చంద్రబాబుకు అస్సలు పట్టటం లేదని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు.