నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత: ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్‌సీపీ

By narsimha lode  |  First Published Jan 8, 2024, 7:00 PM IST

పార్టీ గీత దాటిన ఆరుగురు ప్రజా ప్రతినిధులపై  చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ నిర్ణయం తీసుకుంది.  
 


అమరావతి:పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన  నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై  అనర్హత వేటేయాలని  యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులపై అనర్హత వేటేయాలని  ఫిర్యాదు  చేశారు. 

ఉండవల్లి శ్రీదేవి,  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలపై  అనర్హత వేటేయాలని  అసెంబ్లీ కార్యాలయంలో  వైఎస్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది.  మరో వైపు  ఎమ్మెల్సీలు వంశీకృష్ణ,  సి. రామచంద్రయ్యలపై  కూడ అనర్హత వేటేయాలని  వైఎస్ఆర్‌సీపీ  శాసనమండలి చైర్మెన్ కు ఫిర్యాదు చేసింది. 

Latest Videos

undefined

గత ఏడాది జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీకి చెందిన  నలుగురు ఎమ్మెల్యేలు  క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని  అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. అయితే  ఈ ఆరోపణలపై  ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేలు  తోసిపుచ్చారు.  ఉండవల్లి శ్రీదేవి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  తెలుగు దేశం పార్టీలో చేరారు. మిగిలిన వారు కూడ  తెలుగు దేశం పార్టీలో చేరనున్నారు.   విశాఖ జిల్లాకు చెందిన  వంశీకృష్ణ ఇటీవలనే  వైఎస్ఆర్‌సీని వీడి  జనసేనలో చేరారు.  మరో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య  తెలుగు దేశం పార్టీలో చేరారు.  వైఎస్ఆర్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన  ప్రకటించారు. 

పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన  వారిపై  చర్యలు తీసుకోవాలని  వైఎస్ఆర్‌సీపీ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే  నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హత వేటేయాలని కోరింది. 

also read:పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాలని వైఎస్ఆర్‌సీపీ  అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయమై సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలతో  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే  రెండు విడతలుగా  మార్పులు చేర్పులకు సంబంధించిన జాబితాను వైఎస్ఆర్‌సీపీ  ప్రకటించింది.  సుమారు  ముప్పైకి పైగా స్థానాల్లో  అభ్యర్థులను  ఆ పార్టీ మార్చింది.  మరో జాబితాపై కూడ జగన్ కసరత్తు చేస్తున్నారు.  అయితే  టిక్కెట్టు దక్కని అసంంతృప్తులు  ఇండిపెండెంట్ గా పోటీ  చేస్తామని చెబుతున్నారు. కొందరు  పార్టీ మారేందుకు  ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం కూడ సాగుతుంది. మొదటి నుండి జగన్ తో పాటు నడిచిన నేతలకు  కూడ  టిక్కెట్లు దక్కని పరిస్థితి నెలకొంది.  

also read:వైఎస్ఆర్ మరణంపై నారాయణ స్వామి వ్యాఖ్యలు: హైద్రాబాద్ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు

టిక్కెట్టు దక్కనివారు పార్టీ మారితే  వారిపై చర్యలు తీసుకుంటామని వైఎస్ఆర్‌సీపీ  సంకేతాలు పంపింది. గతంలో  ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైఎస్ఆర్‌సీపీ అభ్యర్ధి ఓటమి పాలై  తెలుగు దేశం పార్టీ అభ్యర్ధి విజయం సాధించారు. దీనికి కారణమనే ఆరోపణలున్న  నలుగురు ఎమ్మెల్యేలపై  వైఎస్ఆర్‌సీపీ ఇదివరకే సస్పెన్షన్ వేటేసింది.  ఇవాళ  ఈ నలుగురిపై  అనర్హత వేటేయాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది.   ఇద్దరు ఎమ్మెల్సీలు ఇటీవలనే  పార్టీ మారారు. వారిపై  కూడ  అనర్హత వేటేయాలని ఫిర్యాదు చేసింది. 

 

 

click me!