సీఎం జగన్‌ ఫొటోపై వివాదం.. నెల్లూరు మేయర్ స్రవంతిపై వైసీపీ ఆగ్రహం..

By Sumanth KanukulaFirst Published Apr 24, 2023, 3:09 PM IST
Highlights

నెల్లూరు మేయర్ స్రవంతి‌పై వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పాలక సంస్థ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. 

నెల్లూరు మేయర్ స్రవంతి‌పై వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నెల్లూరు నగర పాలక సంస్థ సమావేశంలో రసాభాస చోటుచేసుకుంది. నెల్లూరు నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో పెట్టడంపై మేయర్ స్రవంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఫొటోను తనకు తెలియకుండా ఎవరు పెట్టారని  ప్రశ్నించారు. దీంతో ఆమె తీరుపై కొందరు వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టికెట్‌పై గెలిచి సీఎం జగన్ ఫొటోపై ప్రశ్నించడం నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వర్గానికి చెందిన కార్పొరేటర్లు మేయర్‌ను ప్రశ్నించారు. 

స్రవంతికి మేయర్‌గా కొనసాగే అర్హత లేదని ఆమెకు వ్యతిరేకంగా  నినాదాలు చేశారు. సమావేశం అజెండా పేపర్లు చించేసి నిరసన వ్యక్తం చేశారు. మేయర్ సమావేశం నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మేయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే  వర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మేయర్ స్రవంతికి మద్దతుగా నిలిచారు. ఈ క్రమంలోనే నెల్లూరు నగరపాలక సంస్థ సమావేశంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఇరువర్గాల కార్పొరేటర్లు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. 

Latest Videos

ఇక, కొద్దిరోజుల క్రితం వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు మేయర్ స్రవంతి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెబితే తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మేయర్ స్రవంతి ప్రకటించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన తన‌కు ఇంతటి అవకాశం వచ్చిందంటే అది శ్రీధర్ రెడ్డి వల్లనేని అన్నారు.

click me!