అమరావతిలో వైసిపి ప్లెక్సీ పాలిటిక్స్... చంద్రబాబు పర్యటన వేళ ఆసక్తికర పరిణామం (వీడియో)

Published : Apr 24, 2023, 01:25 PM ISTUpdated : Apr 24, 2023, 01:27 PM IST
అమరావతిలో వైసిపి ప్లెక్సీ పాలిటిక్స్... చంద్రబాబు  పర్యటన వేళ ఆసక్తికర పరిణామం (వీడియో)

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో చంద్రబాబు పర్యటన నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. చంద్రబాబును అడ్డుకునేందుకు వైసిపి శ్రేణుులు సిద్దమవుతూ భారీ ప్లెక్సీలు ఏర్పాటు చేసారు. 

అమరావతి : ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపిల మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంది. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే... ఆయనను అడుగడుగునా అడ్డుకుని ప్రజల్లోకి వెళ్ళనివ్వకుండా అధికార వైసిపి చూస్తోంది. ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటన ప్రారంభిస్తే... ఆయనను వైసిపి శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ఇలాంటి సమయంలో చంద్రబాబు ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటనకు సిద్దమయ్యారు. ఈ పర్యటన ప్రారంభానికి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి.

రేపటినుండి మూడ్రోజుల పాటు చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఆయన పర్యటన సాగనుంది. ఈ క్రమంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వైసిపి ఏర్పాటుచేసిన భారీ ప్లెక్సీలు ఇరుపార్టీల మధ్య మాటల యుద్దానికి దారితీసింది. చంద్రబాబు సిగ్గు సిగ్గు పేరిట పెదకూరపాడు నియోజకవర్గం గురించి ప్రశ్నలు సంధిస్తూ పెక్సీలు ఏర్పాటుచేసారు. 

వీడియో

చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసిపి సిద్దమైనట్లు ఈ ప్లెక్సీల  ఏర్పాటుతో అర్థమయ్యింది. దీంతో స్థానిక పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నారు. ఇటీవల చంద్రబాబు పర్యటనలో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో వుంచుకుని బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Read More  టీడీపీ, వైసీపీ నేతల పరస్పర సవాళ్లు.. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టెన్షన్‌ వాతావరణం..

చంద్రబాబుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతంలో వెలిసిన ప్లెక్సీలపై టిడిపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేయడం ద్వారా ఎక్కడా జరగనంత అభివృద్ది ఈ ప్రాంతంలో జరిగిందన్నారు. ఇలా ఈ ప్రాంత అభివృద్ది కోసం పాటుపడిన నాయకుడు వస్తుంటే ప్లెక్సీలు ఏర్పాటు చేసి నిరసనలకు సిద్దమవడం దారుణమన్నారు. వైసిపి నాయకులు చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించే తాము ఊరుకోబోమని టిడిపి నాయకులు హెచ్చరిస్తున్నారు. 

మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వైసిపి శ్రేణులకు తీవ్రంగా హెచ్చరించారు. చంద్రబాబు పర్యటనలో దుశ్చర్యలకు పాల్పడితే సహించబోమని...అలాంటివారిని తెలుగుతమ్ముళ్లు తరిమి తరిమి కొడతారంటూ మాజీ మంత్రి వార్నింగ్ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్