
మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని అన్నారు. అప్పుడే రాయలసీమ సాగునీటి సమస్య తీరుతుందని కామెంట్ చేశారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నారు. రాష్ట్రాలను విడగొట్టడం కష్టం కానీ.. కలపడం సులభమని అని వ్యాఖ్యానించారు. తమ వాళ్లు ప్రత్యేక రాయలసీమ అంటున్నారని.. అది సాకారం అయితే మంచిదేనని అన్నారు.