
తాడేపల్లి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేయడానికి ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంట్లో భాగంగా జిల్లాల వారీగా పార్టీ బాధ్యతలను ముగ్గురు కీలక నేతలకు అప్పగించారు.
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల, వైవీ సుబ్బారెడ్డికి ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల, సజ్జల రామకృష్ణారెడ్డికి కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల బాధ్యతలను అప్పగించారు. ఇప్పటి నుండి ఈ ముగ్గురు రాష్ట్రంలోని మొత్తం జిల్లాల పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు.
read more వైసీపీ ప్రభుత్వంపై పార్క్‌హయత్‌లో వైశ్రాయ్ తరహా కుట్ర: శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
అంతేకాకుండా తాడేపల్లిలో ఉన్న పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయ బాధ్యతలను కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి టిటిడి పాలకమండలి అధ్యక్షుడిగా, విజయసాయి ఎంపీగా, సజ్జల ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్నారు.