ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆరుగురు వైసీపీ అభ్యర్ధులు గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆరుగురు వైసీపీ అభ్యర్ధులు గురువారం నాడు నామినేషన్లు దాఖలు చేశారు.గురువారం నాడు అసెంబ్లీ కార్యాలయంలో సెక్రటరీకి ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
వచ్చే నెల 15వ తేదీన ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవలనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన ఇక్బాల్ కు జగన్ రెండోసారి అవకాశం కల్పించారు.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణంతో ఆయన కొడుకు బల్లి కళ్యాణ చక్రవర్తికి జగన్ ఎమ్మెల్సీ సీటిచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మరణంతో ఆయన తనయుడు చల్లా భగీరథరెడ్డికి కూడ జటన్ సీటిచ్చారు. విజయవాడకు చెందిన వైసీపీ కార్పోరేటర్ మహ్మద్ కరీమున్సీసాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దువ్వాడ శ్రీనివాస్ కి కడప జిల్లానుండి సి. రామచంద్రయ్యకు జగన్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు.
ఇవాళ ఉదయం జగన్ ను ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ దాఖలు చేయనున్న అభ్యర్ధులు భేటీ అయ్యారు. కొద్దిసేపు జగన్ వారితో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్ధులకు జగన్ భీ ఫామ్స్ అందించారు.క్యాంప్ కార్యాలయం నుండి ఆరుగురు నేరుగా అసెంబ్లీ కార్యాలయానికి చేరుకొని అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ పత్రాలను అందించారు.