ఢిల్లీకి చేరిన ఏపీ పంచాయతీ: రేపు అమిత్ షాను కలవనున్న చంద్రబాబు.. పోటీగా వైసీపీ కూడా

By Siva KodatiFirst Published Oct 21, 2021, 6:42 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. 36 గంటల దీక్ష ముగియగానే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఢిల్లీ వెళ్లనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. 36 గంటల దీక్ష ముగియగానే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను (amit shah) కలిసి టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. అటు చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.. 

కాగా.. టీడీపీ నేతల బూతు వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ (ysrcp) జనాగ్రహ దీక్షలు చేపట్టింది. నియోజకవర్గాల్లో వైసీపీ శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అటు చంద్రబాబు నాయుడు సైతం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్ష నిర్వహిస్తున్నారు. పోలీసులకు చేతకాకపోతే ఇంటికి వెళ్లిపోవాలని... మమ్మల్ని మేమే కాపాడుకొంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. టీడీపీని తుదముట్టంచేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్నారు. 

Also Read:పట్టాభికి 14 రోజుల రిమాండ్.. బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ, కస్టడీకి ఇవ్వాలన్న పోలీసులు

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని చంద్రబాబు చెప్పారు. కానీ కిందిస్థాయి పోలీసు అధికారులకు సమాచారం ఇస్తే  ఏం జరిగిందని ప్రతిపక్షనేత ప్రశ్నించారన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోగా పట్టాభినే అరెస్ట్ చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ కార్యాలయానికి సీఐ ఎందుకు వచ్చారు.. మా అనుమతి లేకుండా ఆయన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. మీ ఇంటికి అనుమతి లేకుండా వస్తే అనుమతిస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా తమ పార్టీకి చెందిన నేతలపైనే 302 సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలపై దాడి విషయమై పోలీసులు స్పందించకపోతే తాను గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను వివరించానని చంద్రబాబు చెప్పారు. డీజీపీ కార్యాలయం నుండే దుండగులు వచ్చి దాడికి దిగారని ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత దుండగులను పోలీసులు దగ్గరుండి సాగనంపారని  చంద్రబాబు మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైతే ఆర్టికల్ 356 ను ప్రయోగిస్తారన్నారు.

click me!