బాలకృష్ణ కారును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్త యత్నం.. స్వల్ప ఉద్రిక్తత..

Published : Nov 16, 2023, 11:09 AM IST
బాలకృష్ణ కారును అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్త యత్నం.. స్వల్ప ఉద్రిక్తత..

సారాంశం

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆయన ప్రయాణిస్తున్నా కారును వైసీసీ కార్యకర్త ఒకరు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు హైడ్రామా చోటుచేసుకుంది. వివరాలు.. నందమూరి బాలకృష్ణ టీడీపీ నేత అశ్వర్థరెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్తుండగా బాలకృష్ణ కారును మధు అనే వైసీపీ కార్యకర్త అడ్డుకున్నారు. తన చేతిలో ఉన్న ప్లకార్డుతో వాహనాన్ని అడ్డుకోబోయాడు. కారు పైకి ప్లకార్డును విసిరే ప్రయత్నం చేశాడు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు వైసీసీ కార్యకర్త మధును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్లకార్డుకు ఉన్న కర్ర ఎస్సైకి తగిలింది. మధును పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాలకృష్ణ కాన్వాయ్ అక్కడి నుంచి బయలుదేరింది. 

ఇదిలాఉంటే, హిందూపురం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ అశ్వర్త రెడ్డి  కుమార్తె వివాహానికి బాలకృష్ణ హాజరై వదూవరులును ఆశీర్వదించారు. అక్కడ ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అబిమానులు..  జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. 

మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం- జనసేన పార్టీల ఆత్మీయ సమన్వయ సమావేశం నిర్వాహించారు. ఈ సమావేశానికి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, పెనుకొండ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బీకే పార్థసారథి కూడా హాజరయ్యారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?