క్యాంపు రాజకీయాలకు అధ్యుడెవరు

Published : Nov 29, 2016, 12:16 PM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
క్యాంపు రాజకీయాలకు అధ్యుడెవరు

సారాంశం

ఆంధ్రలో బ్రోకర్ రాజకీయాలకు, క్యాంపు రాజకీయాలకు అధ్యుడు చంద్రబాబే నని  ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీటికి మాటికి కడప జిల్లా ఎందుకు తిరుగుతున్నారో చెప్పాలని, ఈ పర్యటనల వల్ల జిల్లాకేమి ఒరగబెట్టారో  ప్రజలకు చెప్పాలని  రాయచోటి వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు.

 

 చంద్రబాబు నాయుడు కడపచుట్టూ తిరగడం ఆయనబ్రోకర్ రాజకీయాలలో భాగమేనని శ్రీకాంత్ విమర్శించారు. 

మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ఎమ్మెల్యేలను బ్రోకర్లతో పోల్చడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.

 

‘ఎన్టీఆర్ హయాం నుంచే క్యాంపు రాజకీయాలు నడిపిన మేధావి చంద్రబాబునాయుడు కాదా. ఇది ఎవరికి తెలియదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో క్యాంపు రాజకీయాలో మొదలయ్యిందే తెలుగుదేశం కాలంలో అందునా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే కాదు,’ అని ఆయన  ప్రశ్నించారు.

 

 

చంద్రబాబు వ్యవహారశైలి పై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

శాసనసభ్యులను ఎగతాళి చేయడం, నియంతలా వ్యవహరించడం మీకే చెల్లింది.  బ్రోకర్ రాజకీయాలు చేసేది మీరు,  ఎమ్మెల్యేలను బ్రోకర్లని మీరేనా, ఇదేమి న్యాయమని అని ఆయన అడిగారు.

 

బాబు వైయస్ఆర్ జిల్లాకు 20 సార్లు వచ్చింది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడానికే తప్ప అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కాదని విమర్శించారు.

 

 కలిసికట్టుగా, నీతినిజాయితీతో వైయస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని గడికోట దీమా వ్యక్తం చేశారు. 

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu