
త్వరలో ‘వైఎస్సార్ కుటుంబం’ కార్యక్రమం కోటి సభ్యత్వాలకు చేరుకుంటోందా? పార్టీ నేతల మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇప్పటి వరకూ 70 లక్షల కుటుంబాలు వైసీపీ సభ్యత్వం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. త్వరలో కోటి సభ్యత్వాల దిశగా వెళుతున్నట్లు కమలాపురం ఎంఎల్ఏ, వైసీపీ అధ్యక్షుడు జగన్ మేనమామ అయినా రవీంద్రనధరెడ్డి చెప్పారు. పార్టీ కార్యక్రమం జరుగుతున్న విధానాన్ని ఎంఎల్ఏ సమీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పై ఉన్న అభిమానం, జగన్ పై ఉన్న నమ్మకంతోనే లక్షలాది కుటుంబాలు సభ్యత్వం తీసుకుంటున్నట్లు రవీంద్రనాధ్ చెప్పారు.